Shriya Sharma: పరిశ్రమలో ఉన్ననాళ్లు మాత్రమే నటులను జనాలు గుర్తు పెట్టుకుంటారు. ఒక్కసారి గ్యాప్ వస్తే మెల్లగా మర్చిపోతారు. ఎప్పుడైనా గుర్తుకు వచ్చి ఆమె ఏం చేస్తుందని ఆరా తీసినప్పుడు లుక్ చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కొందరు హీరోయిన్స్ సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాక పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. పిల్లలు, సంసారం అంటూ గృహిణిలుగా మారిపోతారు. దాంతో ఒకప్పటి స్లిమ్నెస్, ఫిట్నెస్ వాళ్లలో ఉండదు.
మీరు పైన ఫోటోలో చూస్తున్న యంగ్ బ్యూటీ కూడా ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ పలు సీరియల్స్, సినిమాలు చేసింది. క్యూట్ గా ఉన్న ఈ చిన్నది ఎవరో ఎప్పటికీ మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. పేరు తెలియకపోయినా పలానా ఆర్టిస్ట్ కదా అని పోల్చుకుని ఉంటారు. అవును మీ గెస్ కరెక్ట్. ఈమె పేరు శ్రియ శర్మ. చిరంజీవి హీరోగా దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించిన జై చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.
చిరంజీవి మేనకోడలు పాత్రలో అద్భుతంగా నటించింది. జై చిరంజీవి శ్రియ శర్మకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. దాంతో తమిళ్, హిందీ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ దూకుడులో హీరోయిన్ సమంత చెల్లి పాత్ర చేసింది. మహేష్ తో సమంత, శ్రియ శర్మ కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. పెద్దయ్యాక గాయకుడు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీలో అలీ రెజా హీరోగా నటించాడు. అనంతరం బిల్లు గేమర్ అనే హిందీ చిత్రంలో నటించింది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా పరిచయమైన నిర్మలా కాన్వెంట్ మూవీలో కూడా హీరోయిన్ పాత్ర చేసింది. ఏమైందో తెలియదు సడన్ గా చిత్ర పరిశ్రమకు దూరమైంది. 2016 తర్వాత శ్రియ శర్మ సినిమాలు చేయలేదు. ఆమె సోషల్ మీడియాలో మాత్రం అందుబాటులో ఉంది. ఇంస్టాగ్రామ్ లో శ్రియ శర్మ లేటెస్ట్ ఫోటోలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram