Shree Rapaka: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన బోల్డ్ హీరోయిన్స్ లో శ్రీరాపాక ఒకరు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రీరాపాక నగ్నం మూవీలో నటించింది. దారుణమైన యాంగిల్స్ లో కెమెరాలు పెట్టి శ్రీరాపాక అందాలు బంధించాడు వర్మ. ఎప్పటి నుండో పరిశ్రమలో ఉన్న రాని గుర్తింపు నగ్నం మూవీ తెచ్చిపెట్టింది. అసలు ఎవరు ఈ శ్రీరాపాక అని జనాలు సెర్చ్ చేసేంతగా ఆమె పాపులర్ అయ్యింది. నగ్నం ఏమంతగా ఆడలేదు. దాంతో మెల్లగా ఆమె మరుగున పడిపోయింది.
తాజాగా బోల్డ్ కామెంట్స్ తో శ్రీరాపాక వార్తల్లో నిలిచింది. పెళ్లి ముందే సెక్స్ చేయడం తప్పేం కాదంటుంది. దాని వలన సరైన జీవిత భాగస్వామిని ఇచ్చుకోవచ్చు అంటుంది. మగాడి శృంగార సామర్థ్యం తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుందని శ్రీరాపాక అంటున్నారు. ప్రతి ఒక్కరికీ శృంగారం అవసరం. అది ఇవ్వలేని వ్యక్తులను పెళ్లి చేసుకుంటే కష్టం అని శ్రీరాపాక అభిప్రాయం.
తన ఫ్రెండ్ అలానే మోసపోయిందట. శ్రీరాపక ఫ్రెండ్ డాక్టర్ కాగా మరో డాక్టర్ ని వివాహం చేసుకుందట. ఫస్ట్ నైట్ రోజు అతడు గే అని తెలిసిందట. దాంతో ఆమె స్నేహితురాలి జీవితం నాశనమైందని శ్రీరాపాక అంటున్నారు. ఒక డాక్టరే మోసపోతే సామాన్యుల సంగతి ఏంటని ఆమె తన సలహాను సమర్ధించుకుంటున్నారు. శ్రీరాపాక కామెంట్స్ ని సంప్రదాయవాదులు ఖండిస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అంటున్నారు.
శ్రీరాపాక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు శ్రీరాపాకను సమర్ధించడం విశేషం. నిజానికి మోడరన్ సమాజంలో లైవ్ ఇన్ రిలేషన్ కల్చర్ ఎక్కువైంది. పట్టణాల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు సహజీనం చేస్తున్నారు. సెలెబ్రెటీలను దాటి సామాన్యులకు వరకు ఈ కల్చర్ వచ్చేసింది. అలియా భట్, ఇలియానా డేటింగ్ చేసి తల్లులు అయ్యాక పెళ్లిళ్లు చేసుకున్నారు.