క్వారంటైన్‌లో ‘జెర్సీ’ భామ!

కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఈ భామ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’లో నటించి మంచి విజయాన్ని అందుకుంది. నానికి జోడీగా ‘సారా’ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె చేసిన ‘సారా’ పాత్రకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటేగా శ్రద్ధా శ్రీనాథ్ 14రోజులు హోంగా క్వారంటైన్లో ఉన్నట్లు ట్వీటర్లో ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. బెంగళూరుకు చెందిన శ్రద్ధా శ్రీనాథ్ తమిళ సినిమాలతో బీజీగా మారింది. […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 2:57 pm
Follow us on


కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఈ భామ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’లో నటించి మంచి విజయాన్ని అందుకుంది. నానికి జోడీగా ‘సారా’ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె చేసిన ‘సారా’ పాత్రకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటేగా శ్రద్ధా శ్రీనాథ్ 14రోజులు హోంగా క్వారంటైన్లో ఉన్నట్లు ట్వీటర్లో ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

బెంగళూరుకు చెందిన శ్రద్ధా శ్రీనాథ్ తమిళ సినిమాలతో బీజీగా మారింది. షూటింగ్లో భాగగా ఈ అమ్మడు అధికంగా విమాన ప్రయాణాలు చేసేది. మార్చి 12 నుంచి 15తేదీల్లో హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ఎక్కవుగా విమాన ప్రయాణం చేసినట్లు పేర్కొంది. తాను ప్రయాణించిన విమానంలో ఎవరికీ కరోనా సోకలేదని తెలిపారు. మందు జాగ్రత్తగా ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు తనకు తానుగా 14రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ట్విట్టర్లో పేర్కొంది.

మార్చి 29తేదితో క్వారంటైన్‌ 14రోజులు పూర్తయిందని పేర్కొంది. ప్రస్తుతం కిచెన్‌లో అమ్మకి సాయం చేస్తున్నానని శ్రద్ధా ట్వీట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా 14రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ తనను ఆదేశించిందని వస్తున్న వార్తలో నిజంలేదని ఆమె స్పష్టం చేసింది.