Ustaad Bhagat Singh Latest Updates: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘ఓజీ'(They Call Him OG) మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. థియేటర్స్ లో భారీ అంచనాల నడుమ విడుదలై 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే 32 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, కోటి వ్యూస్ వైపు పరుగులు తీస్తోంది. ఊపు చూస్తుంటే టాలీవుడ్ నుండి #RRR తర్వాత అంతటి వ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రం ఓజీ కచ్చితంగా నిలుస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు విశ్లేషకులు. ఇక ఓజీ గురించి కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh).
గబ్బర్ సింగ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండవ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ మొత్తం పార్ట్ మొత్తం గత నెలలోనే పూర్తి అయ్యింది. ఇప్పుడు కేవలం ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు దాదాపుగా పది రోజుల పాటు రీసెంట్ గానే చిత్రీకరించారు. ఇక ఆ తర్వాత నవంబర్ రెండవ వారం నుండి నవంబర్ 26 వరకు నాన్ స్టాప్ గా సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఒకవేళ కాస్త అటు ఇటు అయితే నెలాఖరు వరకు కూడా షూటింగ్ ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయట. అంటే పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాల షూటింగ్ దాదాపుగా నెల రోజులు చిత్రీకరిస్తున్నారు అన్నమాట. ఓజీ చిత్రం షూటింగ్ కూడా ఇంతే,పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు చాలా రోజుల వరకు షూట్ చేశారు.
ఓజీ లో పవన్ కనిపించేది కూడా తక్కువే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా తక్కువ కనిపిస్తాడా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం దాదాపుగా 60 రోజులు పని చేసాడు. ఇప్పుడు తీస్తున్నది మొత్తం విలన్ గ్యాంగ్స్ కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ నే తీస్తున్నారట. అంతే కాకుండా కొన్ని రిస్కీ ఫైట్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ డూప్ ని ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అందుకే ఇన్ని రోజుల సమయం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇకపోతే ఈ సినిమాకు సంబందించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చే నెల లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయట. మార్చ్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.