Homeఎంటర్టైన్మెంట్హీరోగారి కూతురు బాగా హైలైట్ అవుతుందట !

హీరోగారి కూతురు బాగా హైలైట్ అవుతుందట !

Shivathmika‘రంగమార్తాండ’ ఈ టైటిల్ వినడానికి చాల వినసొంపుగా ఉంది. పైగా ఈ టైటిల్ తో క్రియేటివ్ డైరెక్టర్ తన శక్తిని అంతా ధారపోసి సినిమా చేస్తున్నాడు. కాబట్టి.. ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తన ఇమేజ్ తో పాటు తన పైత్యాన్ని కూడా పక్కన పెట్టి.. కృష్ణవంశీ ఈ సినిమా కోసం కిందామీదా పడుతున్నాడు. ఎప్పుడూ లేనిది ఈ సినిమాకి నలుగురు రచయితలను పెట్టుకున్నాడు. కృష్ణవంశీ సినీ కెరీర్ లోనే ఈ సినిమా కోసం తీసుకున్నన్నీ జాగ్రతలు, అలాగే ఈ సినిమా కోసం పడినంత తపన మరే సినిమాకి పడలేదట.

అంతగా తపించిపోతూ చేస్తోన్న సినిమా కాబట్టి.. తన వరుస ప్లాపుల పరంపరకు బ్రేక్ పడుతుందనేది కృష్ణవంశీ ఆశ. పైగా ఇప్పటికే కెరీర్ పరంగా కూడా బాగా వెనకపడిపోయాడు. చాలా గ్యాప్ తరువాత ఆ మధ్య చేసిన నక్షత్రం సినిమా పరువు తీసింది. అది దృష్టిలో పెట్టుకుని ఈ సారి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కీ రోల్ లో ఈ రంగమార్తాండను సెట్ చేసుకున్నాడు. మరాఠీలో సూపర్ హిట్టయిన ఓ సినిమాను రంగమార్తాండగా తీసుకువస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం కీ రోల్స్ లో రమ్యకృష్ణను, బ్రహ్మానందంను, అనసూయలను ఎంపిక చేసుకున్నాడు. అలాగే మరో కీ రోల్ కోసం ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మికాను ఎంపిక చేసుకున్నాడు. కాగా ఈ సినిమాలో శివాత్మిక పాత్ర చాల బలమైనదట, పైగా కృష్ణవంశీ ఈ పాత్రను చాల ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మొత్తానికి పాత్ర బలంగా ఉండటంతో శివాత్మిక నటన కూడా చాల బాగా ఎలివేట్ అవుతుందని.. సినిమా మొత్తంలో శివాత్మిక బాగా హైలైట్ అవుతుందని ఈ చిత్ర యూనిట్ అభిప్రాయపడుతుంది. దొరసాని సినిమాలో శివాత్మిక అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version