Shivaji: బాస్ బాస్ సీజన్ 7 మాస్టర్ మైండ్ శివాజీ ఫినాలే ముగిసిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అయితే ఆయన మాట్లాడుతూ రతిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.రతిక గురించి చెప్తూ ఆమెను కుక్క తో పోల్చారు. శివాజీ మాట్లాడుతూ .. రెండో వారంలో రైతు బిడ్డని టార్గెట్ చేశారు .. ఆ నామినేషన్ లో నేను చెప్తూనే ఉన్నాను. వాడ్ని హీరోని చేస్తున్నారు వినండి రా అని .. నా మాట వినలేదు. నా పక్కనే ఉన్న రతిక కూడా ..వీడు దొంగ అని లేచింది. వద్దు బిడ్డ అని చెప్పాను. ఆమె వినలేదు .బయటకు పోయింది.
రతిక ఫస్ట్ వీక్ లో హౌస్ మెట్ కంటెండర్ అయింది. ఆట అద్భుతంగా ఆడింది. మంచి టాలెండ్ కానీ మొత్తం పోగొట్టుకుంది. ఫస్ట్ టైం వెళ్లిపోయి .. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తన తప్పు తాను తెలుసుకుంది. క్షమాపణ చెప్పింది. ఓకే మనిషిని ఎప్పుడూ టార్చర్ పెట్టకూడదు. అది ఆడ అయినా మగ అయినా .. వాళ్ళు మనుషులే. నా ముందు చేస్తే నేను రియాక్ట్ అవుతా. రతిక మొదటిసారి చేసిన తప్పే మళ్ళీ రెండోసారి చేసింది.
ప్రశాంత్ గాడిపై లేచింది. నేనేం తిట్టలేదు. కుక్క తోక వంకరలే అని వదిలేశాను. రెండోసారి వచ్చినప్పుడు నామినేషన్స్ లో ఎలా ఉండాలో నేను చెప్పాను. నేను చెప్పినట్లే ఉన్నది. అందుకే ఆ వారం ఉంది. ఆ తర్వాత ఏమైందో మళ్ళీ ప్రశాంత్ గాడిని ఏసుకుంది. దాన్ని చూసి, ఇక ఇది మారదు వేస్ట్ అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ పోయింది.
నేను నిజం చెప్తున్నా. రతికకి మెమరీ పవర్ ఎక్కువ. డాన్స్, సింగింగ్, గేమింగ్ చాలా బాగున్నాయి. కానీ సరిగా ఉపయోగించుకోలేదు. రెండో సారి వచ్చినప్పుడు కూడా పద్ధతి మార్చుకోపోవడంతో, నేనే కావాలని దూరం పెట్టాను. రేపటి రోజున నన్ను ఏమైనా అంటుంది అని నేను పట్టించుకోలేదు. నా గౌరవాన్ని నేను పోగొట్టుకోవాలని అనుకోలేదు. అందుకే ఆ అమ్మాయి రెండోసారి కూడా ఎలిమినేటై బయటకు వచ్చేసింది అని శివాజీ చెప్పుకొచ్చాడు.