Spy Batch: బిగ్ బాస్ సీజన్ 7 ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. షో ఎంత హిట్ అయిందో .. అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా అంతే పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ ద్వారా మంచి ఫాలోయింగ్ ఇంకా క్రేజ్ ను సంపాదించారు. ముఖ్యంగా స్పై బ్యాచ్ గా పేరు తెచ్చుకున్న శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ విశేష ప్రేక్షాదరణ పొందారు. కాగా ఈ ముగ్గురు కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి అని భోలే తెలిపారు.
ఈ నేపథ్యంలో శివాజీ తన శిష్యులతో కలిసి సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శివాజీ, ప్రశాంత్, యావర్ ల మధ్య బాండింగ్ ఏర్పడింది. ఒకరికొకరు అండగా నిలుస్తూ ఫినాలే వరకు వెళ్లారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టాడన్నా.. యావర్ టాప్ 4 లో నిలిచి 15 లక్షలు గెలుచుకున్నాడన్నా, అందుకు శివాజీ సపోర్ట్ చాలానే ఉంది. ఒక మంచి గురువుగా వాళ్ళని సక్సెస్ ట్రాక్ లో నడిపించాడు శివాజీ.
అదే విధంగా శివాజీ చేతికి దెబ్బ తగిలినప్పుడు .. ప్రశాంత్, యావర్ లు సేవలు చేశారు. అతనికి అండగా నిలిచారు. అలా ముగ్గురూ ఒకరి కోసం ఒకరు నిలబడిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో స్పై బ్యాచ్ కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూ లో శివాజీ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. హౌస్ లో వాళ్లతో వంద రోజులు ట్రావెల్ చేశానని, ఎంతో బాండింగ్ ఏర్పడిందని .. తన సోల్ మేట్స్ లా మారిపోయారని అన్నారు. వారి కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది అందుకే సినిమా తీయాలనే నిర్ణయం తీసుకునట్లు వెల్లడించారు.
అయితే అది షాట్ మూవీగా చేయాలనుకున్నారట. రెండు మూడు నెలల్లో ప్రకటన వస్తుందని, సెట్ పైకి తీసుకెళ్తాను అని చెప్పారు. ఈ సినిమా టైటిల్ కూడా శివాజీ చెప్పేశారు. స్పై బ్యాచ్ గా పాపులర్ అయ్యాం కాబట్టి అదే టైటిల్ అన్నారు. అయితే సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నానని .. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి అని చెప్పారు. మళ్ళీ తీయకపోతే నన్ను అడగొద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చాడు శివాజీ.