Shiva Rajkumar: శివ రాజ్ కుమార్, గీతా శివరాజ్ గారాల కూతురు నివేదిత త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. గతంలో నివేదిత కొన్ని వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె తొలిసారిగా వెండితెర మీద కనిపించబోతుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కంఠీరవ రాజకుమార్ కుటుంబంలోని మూడవ తరం కూడా సినిమాలలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాఘవేంద్ర రాజకుమార్ ఇద్దరు కొడుకులు కూడా ప్రముఖ నటులుగా సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇద్దరు కూతుళ్లు కూడా ఇంకా చిన్న వయసు వాళ్లే. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి వాళ్లకు చాలా సమయం పడుతుంది. ఇక శివన్న పెద్ద కూతురు డాక్టర్ గా సెటిలైపోయింది. ఇప్పుడు ఆయన చిన్న కూతురు నివేదిత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. తల్లి, అత్త, అమ్మమ్మ అడుగుజాడల్లోనే నిర్మాణంలో పాలు పంచుకోనుంది నివేదిత. నివేదిత శివరాజ్ కుమార్ శ్రీ ముత్తు సినీ సర్వీసెస్ అండ్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. తన మొదటి సినిమా రిలీజ్ తేదీని ప్రకటించింది. ఒక ప్రత్యేక రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. ఫైర్ ప్లే అనే సినిమాను నివేదిత నిర్మించింది. ఈ సినిమా రాజ్ కుమార్ జయంతి అయిన ఏప్రిల్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నివేదిత నిర్మించిన తొలి సినిమా ఫైర్ ప్లే లో వంశీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
Aslo Read: ధనుష్, విజయ్ అలాగే సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
ఇక ఈ సినిమాకు దర్శకత్వం కూడా ఆయనే వహించినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో అచ్యుత్ కుమార్, సుధారాణి, రచన ఇంధర్, శీతల్ శెట్టి, ఆనంద్ నినాసం, చిత్కలా విరాధర్ మరియు ముగ్గు సురేష్ వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు. తన గారాల పట్టి తొలి సినిమా గురించి ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ నా కూతురు మొదటి సినిమా అప్పాజీ పుట్టినరోజున విడుదల కావడం నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. మా కుటుంబం పట్ల ప్రజలు చూపిస్తున్న ప్రేమ అంతా అప్పాజీ నుంచే వచ్చింది.
Aslo Read: హీరోయిజానికి కొత్త స్టైల్ ని తీసుకొచ్చింది పవన్ కళ్యాణే: సిద్దు జొన్నలగడ్డ
మీలో ప్రతి ఒక్కరూ తర్వాతి తరం పట్ల ఒకే రకమైన ప్రేమను చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు నిరంతరం మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు మరియు కన్నడ సినిమా ప్రేమికులందరికీ ధన్యవాదాలు. ఫైర్ ప్లే సినిమా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమా. ఇంత లోతైన కథను చాలా సరళంగా మరియు హాస్య భరితంగా చెప్పగలగడం నాకు చాలా దగ్గరగా అనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
View this post on Instagram