Sharwanand Biker Movie Remuneration: ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న శర్వానంద్ , నాలుగు రోజుల క్రితం ‘బైకర్’ మూవీ తో మరోసారి ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గొప్ప గా రాణించలేవని, కచ్చితంగా ఫ్లాప్ అవ్వుధి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేసేవారు. కానీ సోమవారం రోజున ఈ చిత్రం కనబర్చిన హోల్డ్ ని చూసి ట్రేడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఇప్పటికీ కూడా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి టికెట్ సేల్స్ చాలా డీసెంట్ గా జరుగుతున్నాయి. పబ్లిక్ లో మౌత్ టాక్ గట్టిగా ఉండడం తో , ఒక పది రోజుల పాటు మంచి థియేట్రికల్ రన్ ని ఈ చిత్రం సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అదేమిటంటే హీరో శర్వానంద్ ఈ చిత్రం కోసం ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. కేవలం లాభాల్లో వాటాలు మాత్రమే తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారట. ఎందుకంటే ఈ చిత్రం శర్వానంద్ వరుస ఫ్లాప్స్ తో, మార్కెట్ మొత్తాన్ని కోల్పోయిన రోజుల్లో ఒప్పుకున్న సినిమా కాబట్టి. పైగా యూవీ క్రియేషన్స్ లో ఉన్నవాళ్ళంతా తన స్నేహితులే కాబట్టి, పరస్పర అంగీకారం తో ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడట శర్వానంద్. అయితే ఈ ఇందులో ప్రధాన పాత్ర పోషించిన రాజశేఖర్ మాత్రం రెమ్యూనరేషన్ గట్టిగానే అందుకున్నట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ చిత్రం కోసం దాదాపుగా రెండు కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట. దీంతో శర్వానంద్ కంటే రాజశేఖర్ అత్యధిక రెమ్యూనరేషన్ ని ‘బైకర్’ లో నటించినందుకు తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ చిత్రానికి రాజశేఖర్ కచ్చితంగా చాలా పెద్ద ప్లస్ అయ్యాడు అనే చెప్పాలి. చాలా కాలం తర్వాత ఆయనకు మంచి పాత్ర దొరికింది. ముఖ్యంగా శర్వానంద్ తో రాజశేఖర్ కాంబినేషన్ సన్నివేశాలన్నీ అదిరిపోయాయి. అందుకే ఈ చిత్రం సోమవారం రోజున కూడా నిలబడిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి సినిమాకు తన పాత్ర అంత ప్లస్ అయ్యినప్పుడు ఆ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు లేదు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తొలిసినిమాతోనే మంచి రెస్పాన్స్ ని అందుకున్న రాజశేఖర్ , రాబోయే రోజుల్లో క్యారెక్టర్ రోల్స్ కోసం ఇంకా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.