Sharwanand OMI: స్టార్ హీరో అయ్యేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేక తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరోలలో ఒకరు శర్వానంద్. ఒకప్పుడు శర్వానంద్(Sharwanand) సాధించే విజయాలను చూసి భవిష్యత్తులో పెద్ద సూపర్ స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా శర్వానంద్ గాడి తప్పాడు. చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో శర్వానంద్ సినిమా విడుదలకు దగ్గర్లో ఉందంటే ‘అబ్బా..అతని సినిమానా..? నీరసం బాబోయ్’ అని అనుకునేలా చేశాయి. అందుకే ఆయన మార్కెట్ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ఆయన చివరి చిత్రం ‘మనమే’ కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆయన రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. వాటిల్లో సంపత్ నంది తో ‘భోగి’ అనే చిత్రం కూడా ఉంది.
వీటి సంగతి కాసేపు పక్కన పెడితే శర్వానంద్ రీసెంట్ గానే ఒక ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ పేరు ‘OMI’. ఈ సంస్థ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదు, వెల్ నెస్ ప్రొడక్ట్స్ మరియు హాస్పిటాలిటీ రంగాల్లో కూడా దూసుకొని వెళ్లనుంది. ఈ సంస్థ కు సంబంధించిన లోగో ని రీసెంట్ గానే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించాడు. OMI లోని ఓం అంటే ఓంకారం, ఐ అంటే నేను, ఈ రెండు కలిపితేనే OMI. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ‘OMI అనేది నా డ్రీం ప్రాజెక్ట్. ఇది ఒక విజన్ మరియు బాధ్యత తో కూడిన సంస్థ. ఇది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, అంతకు మించి. ప్రపంచం లో అద్భుతమైన ప్రతిభ ఉన్న నటీనటులు,క్రీడాకారులకు ఈ OMI ఒక గొప్ప వేదికగా మారుతుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే OMI పేరు ఓజీ(They Call Him OG) చిత్రం ద్వారా ఎంత పాపులర్ అయ్యిందో మనమంతా చూశాము. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పుట్టినరోజునా ఆ చిత్రం లోని విలన్ క్యారక్టర్ OMI ని పరిచయం చేస్తూ ఒక వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా లో ఒక సెన్సేషన్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ వీడియో లోని ఆడియో తో సరికొత్త ఎడిట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అలా ఓజీ చిత్రం లోని పాపులర్ అయిన OMI పేరుతో శర్వానంద్ వంటి హీరో ఒక కంపెనీ పెట్టడం తో ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ సంస్థ ద్వారా శర్వానంద్ ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.