Site icon OkTelugu

Sharwanand Emotional Video: వెండితెర కు సాష్టాంగ నమస్కారం చేసిన హీరో శర్వానంద్.. వీడియో వైరల్..

Sunrisers Hyderabad Vs Lucknow

Sunrisers Hyderabad Vs Lucknow

Sharwanand Emotional Video: ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శర్వానంద్(Actor Sharwanand) హీరో గా నటించిన ‘బైకర్'(Biker Movie) చిత్రం, ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది. మూవీ టీం కి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినందుకు చాలా సంతోషంగా అయితే ఉంది కానీ, కలెక్షన్స్ మాత్రం భారీగా లేవు. ప్రస్తుతానికి డీసెంట్ గానే ఉన్నాయి కానీ, అవి బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఏ మాత్రం సరిపోవు. ఈ చిత్రం పై IPL ప్రభావం కూడా చాలా బలంగానే పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల సునామీ ని సృష్టించిన ‘ధురంధర్ 2’ చిత్రమే IPL దెబ్బకి పడిపోయింది. ఇక ‘బైకర్’ ఎంత చెప్పండి. అయితే హీరో శర్వానంద్ మూవీ ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు .

విడుదలకు ముందు పెద్దగా ప్రొమోషన్స్ చెయ్యలేదు కానీ , విడుదల తర్వాత మాత్రం చాలా గట్టిగానే చేస్తున్నాడు. నిన్న శ్రీరాములు థియేటర్ కి వెళ్లిన శర్వానంద్, చాలా ఎమోషనల్ అయిపోయాడు. వెండితెర ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదే శ్రీరాములు తెరపై చిరంజీవి గారి సినిమాలు చూసాను , ప్రభాస్ అన్నయ్య సినిమాలు చూశాను , ఇప్పుడు నా సినిమాని నేను చూస్తున్నాను, ఒట్టేసి మరీ చెప్తున్నాను , ‘బైకర్’ చిత్రం నా కెరీర్ లోనే బెస్ట్ సినిమా అంటూ శర్వానంద్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అయితే ఈ వీడియో ని చూసిన తర్వాత సోషల్ మీడియా లో కొంతమంది శర్వానంద్ కి అసలు ఏమైంది , చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు , ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలా చేయలేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

ఇక ‘బైకర్’ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే , మొదటి రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి దాదాపుగా 21 కోట్ల రూపాయిల వేల్యూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే వచ్చే వారం మొత్తం ఈ సినిమా బాగా ఆడాలి. మరి ఆ రేంజ్ లో ఆడుతుందో లేదో చూడాలి. ఇక మూడవ రోజు బుక్ మై షో స్టేటస్ విషయానికి వస్తే , ప్రస్తుతానికి గంటకు 2 నుండి 3 వేల లోపు టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.

Exit mobile version