
యువ హీరోల్లో మంచి టాలెంట్ ఉన్న నటుడు శర్వానంద్. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ మూస కథల్ని పట్టుకుని వేలాడకుండా వైవిధ్యమైన సినిమాలు, నటనకు ఆస్కారమున్న కథలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొన్నాళ్లుగా శర్వాకు సరైన హిట్ పడలేదు. రెండేళ్లుగా చేసిన ప్రతి సినిమా పరాజయం చెందుతూ వచ్చింది. ‘పడి పడి లేచే మనసు’తో మొదలైన ఫ్లాప్స్ పరంపర ‘రణరంగం, జాను’ వరకు కొనసాగింది.
Also Read: పవన్ కొత్త సినిమాకి పాత టైటిల్ నిజమేనా ?
దీంతో ఆయన్ను అమితంగా ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అందుకే శర్వా ట్రాక్ మార్చాడు. అటు కుటుంబ ప్రేక్షకులను ఇటు యువతను ఆకట్టుకునే విధంగా సినిమాలని సెట్ చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కిశోర్ బి డైరెక్షన్లో చేస్తున్న ‘శ్రీకారం’ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే శర్వా గత చిత్రం ‘శతమానంభవతి’ తరహాలో ఈ సినిమా ఉండనుంది.
Also Read: బిగ్ బాస్-4: నాగార్జున ప్లేస్ లో సమంత తేలిపోయిందా?
అలాగే తన 30వ సినిమాను శ్రీకార్తీక్ దర్వకత్వంలో చేస్తున్నాడు. ఇది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం. త్వరలోనే చిత్రం పూర్తికానుంది. దీని తర్వాత అజయ్ భూపతి సారథ్యంలో ‘మహాసముద్రం’ చేయనున్నాడు. ఇది పూర్తిగా యూత్ ఎంటర్టైనర్. ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఇవి కాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం చేయనున్నాడు. ఇది పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్. ఇలా నాలుగు రకాల సినిమాలను లైన్లో పెట్టిన శర్వా ఈసారి వరుస హిట్లు అందుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు.