Game Changer: శంకర్ ఇండియాస్ గ్రేట్ డైరెక్టర్స్ లో ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన తెరకెక్కించిన ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్. భారీ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. శంకర్ తెరకెక్కించిన జెంటిల్ మెన్, ప్రేమికుడు, జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో.. చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు. కానీ శంకర్ తన మార్క్ కోల్పోయాడు. 2015లో విడుదలైన ఐ చిత్రం నుండి ఆయనకు సరైన విజయం లేదు. విక్రమ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఐ మూవీ ఆడలేదు.
అనంతరం రోబో సీక్వెల్ 2.ఓ చేశాడు. ఈ మూవీ కొంత మేర వసూళ్లు సాధించినప్పటికీ రోబో మాదిరి మెప్పించలేదు. ప్రేక్షకులను పెద్దగా థ్రిల్ చేయలేకపోయింది. ఇక భారతీయుడు 2 తో శంకర్ పరువు పోగొట్టుకున్నారు. కల్ట్ క్లాసిక్ గా ఉన్న భారతీయుడు చిత్రానికి రీమేక్ చేసి తప్పు చేశాడు. భారతీయుడు 2తో శంకర్ విమర్శలపాలయ్యాడు. భారతీయుడు 2 మూవీ చూశాక గేమ్ ఛేంజర్ పై అనుమానాలు పెరిగాయి. అనుకున్నట్లే గేమ్ ఛేంజర్ ని కూడా శంకర్ తన స్థాయి చిత్రంగా మలచలేదు.
అయితే గేమ్ ఛేంజర్ కి మిక్స్డ్ టాక్ రావడానికి శంకర్ కాదట. రామ్ చరణ్ మూవీని ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడిందట. జనవరి 10న విడుదలయ్యే సినిమాలు ఆడవు అట. ఈ మేరకు ఓ వాదన తెరపైకి వచ్చింది. దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే మూవీ చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వన్ నేనొక్కడినే 2014 జనవరి 10న విడుదలైంది. ఆ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
అలాగే త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య అజ్ఞాతవాసి తెరకెక్కింది. ఇది పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కావడం విశేషం. 2018 జనవరి 10న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ సెంటిమెంట్ కి రామ్ చరణ్ కూడా బలైయ్యాడు అంటున్నారు. జనవరి 10న గేమ్ ఛేంజర్ విడుదల చేయడం వలనే, మిక్స్డ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన నేపథ్యంలో మరొక తేదీన విడుదల చేసి ఉంటే, హిట్ అయ్యేదంటూ ఓ వాదన వినిపిస్తోంది. అయితే ఇవన్నీ మూఢ నమ్మకాలు, జనవరి 10న విడుదలైన అనేక సినిమాలు విజయాలు సాధించాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Web Title: Shankar is not the reason why game changer got negative talk pawan kalyan is also responsible
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com