OTT Platform: ఈ ఓటీటీలు ఫామ్ లోకి వచ్చాక, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బూతు మయం అయిపోయింది. వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో డిజిటల్ వేదికలు ఘాటు తనానికి వేడెక్కిపోతున్నాయి. అరె.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి వెళ్లినా ఆ బోల్డ్ నెసే మెయిన్ యవ్వారం అయిపోయింది. మరి ఈ డిజిటల్ మాధ్యమాలకు సెన్సార్ షిప్ లేకపోవడమే ఈ దిగజారుడు తనానికి ముఖ్య కారణం అయి ఉండొచ్చు.

మరోపక్క తమను అడిగేవాడు లేడు అని ఈ బూతు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. మరి వీరి అడ్డు అదుపు లేని తనానికి అడ్డుకట్ట వేసేది ఎప్పుడు ? అసలు ఏం సినిమా తీస్తున్నామో కనీస అవగాహన లేకుండా బూతు రాయుళ్లు తమ బుర్రలకు పదును పెట్టి మరీ మసాలా సీన్స్ ను దంచికొడుతున్నారు. పైగా బూతుల్లో కూడా క్రియేటివిటీని చూపిస్తూ డబ్బులు పోగేసుకుంటున్నారు.
అదేమిటి అంటే.. మీకు తెలియదు ఏమో.. సినిమాల్లోనూ ఈ తరహా బూతులు ఉన్నాయండీ అంటూ ఎదురుతిరుగుతున్నారు. నిజమే, ఇప్పుడు సినిమాల్లోనూ బూతులుంటున్నాయి. ఒకప్పుడు సినీ సెన్సార్ నిబంధనలు కఠినంగా ఉండేవి. ప్రస్తుతం నిబంధనలు సరళంగా ఉంటున్నాయి. పెద్దలకు మాత్రమే అయితే ‘ఎ’, అందరూ చూసే సినిమా అయితే ‘యు’ అంటూ సర్టిఫికెట్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
Also Read: సినిమా రంగం కష్టానికి కారణం.. ఈ సినిమా పిచ్చోళ్లే !
అదే ఒకప్పుడు సినిమాలో ‘వెధవా’ అని సంబోధిస్తే చాలు, ఆ మాట తొలగించేవారు. ఐటమ్ సాంగ్స్ అశ్లీలంగా ఉంటే.. కత్తిరించిపారేసే వారు. ఇక ప్రభుత్వాన్ని, పోలీసులను విమర్శించినా ఆ సీన్స్ ను తొలగించేవారు. కానీ ప్రస్తుతం సెన్సార్ వ్యవహారాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గత పది సంవత్సరాలుగా అశ్లీల పదాలు, దృశ్యాలు సైతం చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.
దాంతో కొన్ని సినిమాలను కుటుంబంతో కలసి చూడలేని స్థితి, దుస్థితి ప్రస్తుతం మనకు ఉంది అంటే.. మనం కాదు, సెన్సార్ సభ్యులు సిగ్గుతో తలదించుకోవాలి. ద్వంద్వార్దాలతో చిత్రాలు తీసి జనం మీదకు వదులుతుంటే.. సెన్సార్ ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు కరెక్ట్ ? అయినా ఈ సెన్సార్ పై మనం ఎన్ని ఆరోపణలు చేసినా సెన్సార్ అధికారులు మాత్రం పట్టించుకునేలా లేరు.
Also Read: ఏంటండీ ? డైలాగ్స్ లో పాత వాసన కొడుతుంది ?