Shalini Pandey: అరెరే ఈ హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది ? సామాజిక మాధ్యమ ప్రజల రాజ్యంలో మంటలు పెట్టడానికి ప్రయత్నించి.. చివరకు ఇలా తన లుక్ నే దిగజార్చుకుందే. ఇదంతా ‘షాలిని పాండే’ గురించే. అర్జున్ రెడ్డి సినిమాలో బబ్లీ లుక్ లో హోమ్లీ బ్యూటీ గా కనిపించి అలరించింది. ఎప్పుడూ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కవ్విస్తూ కనిపించే ఈ స్మాల్ బ్యూటీ… తాజాగా తన ఇన్స్టా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో షాలిని బాగా బక్కచిక్కి పోయి కనిపించింది.

బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్నా ఆమెలోని అందాలు కంటే.. ఆమె శరీర బలహీనతే ఎక్కువ హైలైట్ అవుతుంది. మొత్తానికి ఈ ఫోటోలో షాలిని వయ్యారంగా అయితే నిలుచుంది గాని, ఆమెలో ఆ ఒంపుసొంపులు మిస్ అయ్యాయి. ఒక్కపుడు బొద్దు గుమ్మల నయాగరా నుంచి తీసుకొచ్చి ఎవరో సినీ లోకంలో వదిలారు అన్నట్టు ఉండే ‘షాలిని పాండే’.. ఇలా చివరకు పిండేసినట్టు అయిపోవడం నెటిజన్లు నిర్ణయించుకోలేక పోతున్నారు.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతోనే షాలిని కుర్రాళ్లను ఫిదా చేసింది. అయితే, ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి చిత్రాల్లో కూడా నటించినా అవి ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం షాలిని తన కెరీర్ లో మరో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. సినిమాలెన్ని చేసినా ఇంకా అర్జున్ రెడ్డి దగ్గరే ఆగిపోయిందనే అపవాదుల నుంచి బయట పడటానికి ప్రస్తుతం షాలిని ఎన్నో కసరత్తులు చేస్తూ ఉంది.

ఈ క్రమంలోనే ఇలా బరువు తగ్గి.. తన లుక్ ను పూర్తిగా మార్చుకుని కనిపించింది. ఆయితే, ఈ లుక్ ఆమెకు ఏ మాత్రం సూట్ కాలేదు. అసలుకే అర్ధాంతరంగా కిందకి పడిపోయిన తన కెరీర్ కు ఈ లుక్ ఇంకా మైనస్ అయ్యేలా ఉంది. మళ్ళీ ఆమె తన కెరీర్ ను నిలబెట్టుకోవాలంటే.. ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. పైగా ప్రస్తుతం షాలిని పాండే బాలీవుడ్ లో ప్రవేశించింది.

అక్కడ సినిమాల్లో నటిస్తోంది. జైష్ బై జోర్దార్ అనే సినిమాలో రణ్ వీర్ సింగ్ పక్కన నటిస్తోంది. షాలిని ఇలాగే బక్కచిక్కి పోయి కనిపిస్తే.. బాలీవుడ్ లో ఆమె నిలదొక్కుకోవడం ఇక కష్టం అవుతుంది. ఇప్పటికైనా ఈ క్యూట్ బేబీ తన ఫిజిక్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే బెటర్.