Dunki: 2023 షారుఖ్ ఖాన్ కి గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. హిట్ కోసం దశాబ్దానికి పైగా షారుఖ్ ఖాన్ ఎదురుచూశారు. పఠాన్ మూవీతో ఆయన గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చారు. పఠాన్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. స్పై థ్రిల్లర్ గా పఠాన్ తెరకెక్కింది. షారుఖ్ ఖాన్ అద్భుత పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. పఠాన్ మూవీని మరవక ముందే జవాన్ తో మరో భారీ హిట్ అందుకున్నాడు. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సైతం వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ చేరుకుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అనంతరం… డంకీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.
డంకీ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. సలార్ కి పోటీగా డిసెంబర్ 21న విడుదల చేశారు. డంకీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా డంకీ సడన్ గా ఓటీటీలో వచ్చింది. ఫిబ్రవరి 15 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.
డంకీ ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. షారుఖ్ ఖాన్ అభిమానులు చూసి ఎంజాయ్ చేయవచ్చు. దీంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డంకీ మూవీలో షారుఖ్ ఖాన్ కి జంటగా తాప్సీ పన్ను నటించింది. విక్కీ కౌశల్ కీలక పాత్ర చేశాడు. బోమన్ ఇరానీ సైతం నటించారు.
డంకీ ఐదుగురు యువకుల కథ. లండన్ కి వెళ్ళాలి అనేది వారి కల. దాని కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే అధికారికంగా లండన్ వెళ్లేందుకు వాళ్లకు అవకాశం రాదు. దాంతో అక్రమంగా లండన్ లో అడుగుపెట్టాలని భావిస్తారు. లండన్ చేరుకునే మార్గంలో వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కష్టాలు పడతారు. వారి లక్ష్యం ఎలా నెరవేరింది అనేది చిత్ర కథ. రాజ్ కుమార్ హిరానీ తన మార్క్ ఎమోషన్, హ్యూమర్, సోషల్ అంశాలు జోడించి తెరకెక్కించారు.