Jawan Review: దశాబ్దాలుగా షారుఖ్ ఖాన్ సినిమాలంటే పడిచచ్చే వారు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో షారుఖ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికీ యంగ్ డైనమిక్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. బాలీవుడ్ బాద్షా ఇటీవల ‘పఠాన్’ సినిమాతో అలరించాడు. తాజాగా ‘జవాన్’తో థియేటర్లోకి వచ్చాడు. ఈ సినిమా ఎలో ఉందో చూద్దాం..
నటీనటులు:
షారుఖ్ ఖాన్
నయనతార
విజయ్ సేతుపతి
దీపికా పదుకునే
ప్రియమణి
సన్యా మల్హోత్రా
సునీల్ గ్రోవర్
యోగి బాబు
రిద్ది డోగ్రా
అస్తా అగర్వాల్
సాంకేతిక వర్గం:
డైరెక్టర్: అట్లీ
నిర్మాత: గౌరీఖాన్
సంగీతం: అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు
ఎడిటర్: రూబెన్
కథ:
సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఆజాద్ (షారుఖ్ ఖాన్) చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు. ఇందులో భాగంగా ఉగ్రవాదులతో చేతులు కలుపుతాడు. ఇదే సమయంలో మెట్రో ట్రైన్ ను హైజాక్ చేస్తారు. అయితే ఇది ఆజాద్ చేశాడని భావించిన పోలీసుల్లో ఓ ఆఫీసర్ నర్మదా (నయనతార) ఆయన ను పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇంతలో రాథోడ్(మరో షారఖ్ ఖాన్)ఎంట్రీ ఇస్తాడు. దీంతో అయోమయానికి గురై.. చివరికి అసలైన వారిని ఎలా పట్టుకున్నారు? అనేది సినిమా కథాంశం
విశ్లేషణ:
‘జవాన్’ పేరుతోనే యాక్షన్ మూవీ అని అర్థమవుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హై ఓల్డేజ్ ఉన్న సినిమానే. మంచి మెసేజ్ తో పాటు ఎమోషన్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. మధ్యలో వచ్చే కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తుంది. షారుఖ్ ఖాన్-నయనతార మధ్య సాగే సీన్స్, ఫ్లాఫ్ బ్యాక్ సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే కథ బాగున్నా క్యారెక్టర్ష్ ఎలివేషన్ లో విఫలయ్యారు. కొన్ని సీన్స్ చూస్తే రియాలిటీ అనిపించదు. సెకండాఫ్ పై బాగా హోప్ పెట్టుకొని సినిమా తీసినట్లు అర్థమవుతుంది. కొన్ని చోట్ల లాజిక్స్ ను మిస్ చేశారు.
ఎవరెలా చేశారంటే?
షారుఖ్ ఖాన్ డ్యూయెల్ రోల్ లో మెప్పించాడు. ఆజాద్, విక్రమ్ రాథోడ్ పాత్రలకు ప్రాణం పోశాడు. రఫ్ అండ్ మాస్ అవతారంలో షారుఖ్ తన ప్రతాపం చూపించాడు నయన తార పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంది. ఇన్నాళ్లు అందాల తారగానే అలరించిన ఈమె భారీ యాక్షన్ నటి అని చెప్పగలిగింది. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు వారి పాత్రలను మెప్పించారు.
సాంకేతిక వర్గం ఎలా పనిచేసిందంటే?
ఈ మూవీ టెక్నికల్ గా బాగా శ్రమ పడ్డారని తెలుస్తుంది. క్రెడిట్ ముందుగా డైరెక్టర్ అట్లీకే దక్కుతాయి. నిర్మాణ విలువలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చూసుకున్నారు. మ్యూజిక్ తో అనిరుద్ ఆకట్టుకున్నారు. సినిమా టోగ్రఫీ హైలెట్ గా నిలిచింది. కోన్నీ కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ కష్టం కనిపిస్తుంది.
రేటింగ్ : 3/5