Shah Rukh Khan Controversy: బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ (Sharukh Khan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయన్ని బాలీవుడ్ బాద్షా గా నిలిపాయి. అమితాబచ్చన్ (అమిత Bachhan) తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఏకైక బాలీవుడ్ హీరో కూడా తనే కావడం విశేషం… మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట షారూక్ ఖాన్ చేయబోతున్న సినిమాలు గొప్ప విజయాలను సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న పోటీని తట్టుకొని నిలబడుతున్న హీరోల్లో షారుక్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ తెలుగు హీరోలను మాత్రం షారూక్ ఖాన్ బీట్ చేయలేకపోతున్నాడు. ఇక రాబోయే సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. మొదట్లో సీరియల్లో నటించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన షారూక్ ఖాన్…హీరోగా మొదట్లో కొంచెం తడబడినప్పటికి ఆ తర్వాత వరుస విజయాలను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ప్రముఖ దర్శకుడు నిర్మాత షారూక్ ఖాన్ ను కొన్ని ఇబ్బందులైతే పెట్టాడు అంటూ అప్పట్లో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి.
అయితే ఆ నిర్మాత దర్శకుడు షారుక్ ఖాన్ ను లైంగికంగా కూడా వేధించాడట. షారూక్ తో పాటు ఆయన మరికొంతమంది హీరోలను కూడా ఇబ్బంది పెట్టాడట. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలంటే మాత్రం వరుసగా భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
Also Read: Shah Rukh Khan: మెట్ గాలాలో మెరిసిన షారుఖ్.. ఆయన ధరించన వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఒకప్పుడు ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా పేరు సంపాదించుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు మాత్రం మన తెలుగు వాళ్ళ దాటికి కోలుకోలేకపోతుంది. మన స్టార్ హీరోలు సైతం వరుసగా మంచి సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను వాళ్ళ అభిమానులుగా మార్చుకుంటున్నారు. తద్వారా క్రమక్రమంగా ఖాన్ త్రయం గా చెప్పుకునే షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ క్రేజ్ అనేది పడిపోతుంది.
వాళ్ళ మార్కెట్ కూడా ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. అందువల్లే మంచి సినిమాలను చేయడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మీదట ఆయన చేసే సినిమాలు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాయి. మరోసారి తను బాలీవుడ్ బాద్షాగా ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…