Homeఎంటర్టైన్మెంట్Aishwarya Addala: అక్రమ సంబంధాలు, దురలవాట్లు... న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు సీరియల్ నటి భర్త

Aishwarya Addala: అక్రమ సంబంధాలు, దురలవాట్లు… న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు సీరియల్ నటి భర్త

Aishwarya Addala: ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త ఆరోపణలు చేశాడు. మీడియా ముందుకు వచ్చి ఐశ్వర్య నిజస్వరూపం బయట పెట్టాడు. పైగా అతన్ని బెదిరించి లక్షలు గుంజుకుందట. తన వేధింపులు తట్టుకోలేక సాయం చెయ్యాలి అంటూ మీడియాని ఆశ్రయించాడు భర్త పిన్నింటి శ్యామ్ కుమార్. గత ఏడాది సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్ – అడ్డాల ఐశ్వర్య వివాహం చేసుకున్నారు.

కాపు మాట్రిమోని ద్వారా వాళ్ళకి పరిచయం ఏర్పడింది. పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చారట. వచ్చిన నెల రోజులకే ఐశ్వర్య నిజస్వరూపం బయటపడింది. దురలవాట్లు, అక్రమ సంబంధాలు బయటపడటంతో శ్యామ్ కుమార్ షాక్ అయ్యాడట. ఐశ్వర్య ప్రవర్తన బాగోలేదని ఆమె తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా కూతురికి సపోర్ట్ చేస్తూ అతన్ని ఇబ్బందులకు గురి చేశారట.

దీంతో తన బాధ అంతా మీడియా ముందు వెళ్లగక్కాడు పిన్నింటి శ్యామ్ కుమార్. పెళ్లి పేరుతో మోసం చేసి తన వద్ద రూ . 25 లక్షలు కాజేసిందని భర్త ఆరోపించాడు. అంతేకాదు రియల్టర్ రమేష్ బాబుతో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధింపులకి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎఫైర్ గురించి నిలదీస్తే తన పైన దాడి చేసిందని ఆవేదన చెందాడు. విడాకులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతానని ఐశ్వర్య బెదిరింపులకు గురి చేస్తుందని ఆరోపించాడు భర్త శ్యామ్ కుమార్.

తనకు ఎలాగైనా న్యాయం చేయాలని ఐశ్వర్య భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాని వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇక నటి అడ్డాల ఐశ్వర్య విషయానికొస్తే పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్ లో ప్రసారం అయిన సీరియల్స్ లో నటించింది. అమ్మాయి గారు, పలుకే బంగారమాయేనా, అత్తారింటికి దారేది, అలా వెంకటాపురం సీరియల్స్ లో ఆమె నటించింది.

RELATED ARTICLES

Most Popular