Skanda Movie : మాస్ సినిమాలు తీసి మంచి హిట్లు కొట్టడం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది డైరెక్టర్లు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండే డైరెక్టర్ గా మన బోయపాటి శ్రీను అనే చెప్పుకోవచ్చు.ఒక సినిమా చూస్తున్నంత సేపు హీరో విలన్ ని చితక్కోట్టాలి అని ఆడియెన్స్ కోరుకునేలా ఎమోషన్స్ సీన్స్ ని పండించడం లో ఆయన దిట్ట… ఒక ఫైట్ జరుగుతుంది అంటే ఆ ఫైట్ జరగడానికి సరైన రీజన్ ని పెట్టి ప్రేక్షకులందరిని ఒక ఎమోషన్ లోకి లాక్కెల్లో మరి ఆ ఫైట్ వాళ్ళు ఎంజాయ్ చేసేలా చేసేంత గొప్ప డైరెక్టర్ ఆయన…
ఇక ఆయన తీసిన భద్ర సినిమా నుంచి ఇవాళ్ల రిలీజ్ అయినా స్కంద మూవీ దాక ప్రతి సినిమా కూడా మాస్ అండ్ యాక్షన్ తో ఒక భారీ రేంజ్ లో తీయడం లో ఆయన ఎక్స్ పర్ట్ అనే చెప్పాలి. అయితే మొదట వివి వినాయక్, రాజమౌళి లాంటి డైరెక్టర్లు మంచి మాస్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వాళ్లిద్దరూ వేరే రూట్ లో సినిమాలు తీస్తూ వెళ్తున్న టైం లో బోయపాటి మాస్ సినిమాల జాతరని షురూ చేసాడు.ఆయన ఇంతకు ముందు చేసిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక ఇవాళ్ల రిలీజ్ అయిన స్కంద సినిమా కూడా మంచి టాక్ ని తెచ్చుకొని థియేటర్ లో ప్రేక్షకులను విపరీతం గా అలరిస్తుందనే చెప్పాలి.నిజానికి ఈ సినిమాలో రామ్ ఒక ఊర మాస్ క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ లాంటి హీరో ని సరైనోడు సినిమాలో చాలా మాస్ గా చూపించిన బోయపాటి ఈ సినిమా తో రామ్ ని కూడా అసలు ఎవరు టచ్ చేయని రేంజ్ లో చూపించాడు.అయితే ఈ సినిమా చూసిన తరువాత ఎండ్ కార్డు పడే టైం లో బోయపాటి దీనికి ఓపెన్ ఎండింగ్ పెట్టి స్కంద 2 ఉండబోతుంది అని చెప్పేసాడు.
ఇక దాంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ ఆసక్తి గా మారింది. ఎందుకంటే ఇప్పటికే బోయపాటి వరుసగా రవితేజ,సూర్య ,బాలయ్య లతో వరుస సినిమాలు కమిట్ అయ్యాడు మరి ఆ నేపధ్యం ఈ స్కంద సినిమాకు సిక్వెల్ ఎప్పుడు తీస్తారు అనేది ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న క్వశ్చన్… మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలా నిలబడుతుది అనేదానిని బేస్ చేసుకొని పార్టు 2 ఉంటుందా లేదా అనేది డిసైడ్ చేస్తారేమో ఒక వేళ ఈ సినిమా పక్కాగా ఉంటే మాత్రం స్కంద కు మించి ఉంటుంది అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే బోయపాటి బాలయ్య కాంబో లో హ్యాట్రిక్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక దాంతో ఆయన మళ్లీ బాలయ్య తో ఒక మంచి మాస్ యాక్షన్ సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…దీనికోసం బాలయ్య ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…