Heroine Srilila : ఈ ఏడాది టాలీవుడ్ కి పరిచయమైనా కొత్త హీరోయిన్స్ లో అందరి దృష్టిని బాగా ఆకర్షించిన ముద్దుగుమ్మలలో ఒకరు శ్రీలీల..శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటించిన పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన శ్రీలీల..తొలిసినిమాతోనే తన అందం ,నటన మరియు డ్యాన్స్ తో కుర్రకారులో సెగ పుట్టించేసింది.. ఇప్పుడు ఈమెతో సినిమాలు చెయ్యడానికి స్టార్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు క్యూలు కట్టేస్తున్నారు.

ఈమె జోరు చూస్తూ ఉంటే రాబొయే రోజుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఎలేయడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు..ముఖ్యంగా డ్యాన్స్ విషయం లో ఈమె స్పీడ్ కి అల్లు అర్జున్ , రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా సరిపోరని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఇక ఈమె హీరోయిన్ గా నటించిన రెండవ సినిమా ధమాకా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..రవితేజ హీరో గా నటించిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ చాలా చురుగ్గా పాల్గొంటుంది శ్రీలీల..ఈ ప్రొమోషన్స్ లో తనపై సోషల్ మీడియా లో వస్తున్న ట్రోల్ల్స్ పై స్పందించింది..ఆమెపై ఎందుకు ట్రోల్ల్స్ వచ్చాయంటే రవితేజ సరసన నటించడం వల్లే..ఎందుకంటే రవితేజ వయస్సు దాదాపుగా 53 ఏళ్ళు ఉంటుంది..శ్రీ లీల వయస్సు మాత్రం కేవలం 21 ఏళ్ళు మాత్రమే..ఇద్దరి మధ్య దాదాపుగా 32 ఏళ్ళు తేడా ఉంది..ఇంత ఏజ్ గ్యాప్ పెట్టుకొని రవితేజ రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో చాలా రోజుల నుండి ట్రోల్ల్స్ వస్తూనే ఉన్నాయి..వీటిపై శ్రీ లీల స్పందించింది.
ఆమె మాట్లాడుతూ ‘గతం లో శ్రీదేవి లాంటి హీరోయిన్స్ కూడా ఇలాగే చేసారు..ఎన్టీఆర్ కి కూతురు గా నటించిన శ్రీదేవి, అదే ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించింది..అలా చాలా మంది హీరోయిన్స్ విషయం లో జరిగింది..అప్పుడు పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు కానీ, నేను చేస్తే మాత్రం తప్పు అయిపోయిందా’ అంటూ శ్రీ లీల చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.