Senior Heroine Tabu: ఒకప్పుడు గ్లామర్ బ్యూటీలుగా రాణించిన ఇప్పటి సీనియర్ హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అవ్వడానికి పోటీ పడుతున్నారు. అయితే ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్న నటీమణుల్లో ‘టబు’ ఒకరు. ఒకానొక టైం లో హీరోయిన్ గా తన గ్లామర్ తో, నటన తో ఓ ఊపు ఊపేసిన టబు, ఇప్పటికీ తన క్రేజ్ ను అలాగే మెయింటైన్ చేస్తూనే ఉంది. నిజానికి హీరోయిన్లకు పెళ్లిళ్లు అయితే వెంటనే వారి కెరీర్ దాదాపు ముగిసిపోతుంది అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

మరి ఈ టాక్ ను టబు కూడా బలంగా నమ్మింది ఏమో గానీ.. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. పేరుకు ఒంటరి అయినా.. ఆమెప్పుడు జంటగానే ఉంటుందని పుకార్లు అయితే వినిపిస్తూనే ఉన్నాయి అనుకోండి. ఇక ప్రస్తుత టాపిక్ లోకి వస్తే.. హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా మారితే.. ఇక వాళ్లకు వారు డిమాండ్ చేసిన పారితోషికాన్ని దర్శకనిర్మాతలు అస్సలు ఇవ్వరు.
అయితే ‘టబు’ సెకండ్ ఇన్నింగ్స్ కు మాత్రం మంచి బూస్టప్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని రేంజ్లో పారితోషికం అందుకుంటూ అందరికీ షాకిస్తుంది టబు. ‘భూల్ భులయా 2’, ‘అల వైకుంఠపురములో’, ‘జవానీ జానేమన్’ వంటి చిత్రాలు టబుకు బాగా కలిసొచ్చాయి. చేసేది తల్లి, అత్త, భార్య పాత్రలే అయినప్పటికీ టబు ఉంటే చాలు.. సినిమాకి క్రేజ్ వస్తుంది అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

దీంతో ప్రస్తుతం టబు నటిస్తున్న సినిమాలకు భారీగా పారితోషికం అందుకుంటుంది. టబు షూటింగ్ లో పాల్గొనే ఒక్కో రోజుకు రూ.10 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటుందట. టబు 20 రోజులు కనుక ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటే 2 కోట్ల రూపాయలు దర్శకనిర్మాతలు సమర్పించుకోవాల్సిందే. ఒక విధంగా హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ను పుచ్చుకుంటుంది టబు.
స్టార్ హీరోయిన్లైన కియారా అద్వానీ, దీపికా పాడుకొనే, పూజా హెగ్డే, రష్మిక మందాన్నా, వంటి వారు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నారు. ఇక కుర్ర హీరోయిన్లైన కృతి శెట్టి, శ్రీ లీల వంటి వారు 80 లక్షల నుంచి కోటి ముప్పై లక్షల వరకూ అందుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే టబు.. కుర్ర హీరోయిన్లు కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటుంది.