Senior Hero Suman: కెరీర్ పీక్స్ లో ఉండగా హీరో సుమన్ అనుకోని సమస్యల్లో ఇరుక్కున్నారు. నీలి చిత్రాల కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలలకు పైగా జైల్లో మగ్గిపోయాడు. ఒకప్పటి చీకటి రోజులు సుమన్ పలు సందర్భాల్లో వెల్లడించారు. సుమన్ గురించి అప్పట్లో తమిళ మీడియా దారుణ వార్తలు రాసేదట. వాటికి కౌంటర్ గా తెలుగు మీడియా సుమన్ కి సపోర్ట్ గా నిలబడిందట. తమిళంలో సుమన్ కి వ్యతిరేకంగా కథనాలు వెలువడేవట. సుమన్ అలాంటి వాడు కాదు. నీలి చిత్రాల్లో నటించాల్సిన అవసరం ఆయనకు లేదని కొందరు హీరోయిన్స్ మద్దతుగా నిలిచారట.
మీడియాలో సుమన్ నిర్దోషి అంటూ కుండబద్దలు కొట్టారట. సుమన్ కోరుకుంటే ఆయన పక్కలోకి వచ్చే హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. సుమన్ అలాంటి పనులు అవసరం లేదని ఆ హీరోయిన్స్ సుమన్ కి వైపు మాట్లాడరట. సుమన్ తల్లికి అప్పటి తమిళనాడు గవర్నర్ తో పరిచయం ఉందట. దాంతో సుమన్ కి త్వరగా బెయిల్ వచ్చేలా ఏర్పాట్లు జరిగాయట. అప్పటికే ఆరు నెలలు జైలులో మగ్గిపోయినట్లు సుమన్ వెల్లడించారు.
సుమన్ మిత్రుడు కారణంగా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. సుమన్ మిత్రుడికి వీడియో క్యాసెట్స్ షాప్ ఉండేదట. అతడి వద్ద అప్పుడప్పుడు సుమన్ సినిమాలు తెచ్చుకునేవాడట. అలాగే సుమన్ కారును ఆ మిత్రుడు తరచుగా వాడుకునేవాడట. సుమన్ కారు తీసుకెళ్లిన మిత్రుడు అసాంఘిక చర్యలకు పాల్పడ్డాడు. కారు సుమన్ ది కావడంతో ఆయన్ని అర్థరాత్రి అరెస్ట్ చేశారు. తనకు ఏ పాపం తెలియదన్నప్పటికీ ఆరోపణల మీద జైలుకు పంపారు.
సుమన్ కెరీర్ పై ఏది ప్రతికూల ప్రభావం చూపించింది. ఏడాదికి పదికి పైగా చిత్రాలు చేస్తున్న రోజుల్లో సుమన్ జైలుకి వెళ్ళాడు. అయినా సుమన్ కి ఆఫర్స్ తగ్గలేదు. జైలు నుండి వచ్చాక కూడా హిట్స్, సూపర్ హిట్స్ ఇచ్చాడు. చక్కని రూపం, కరాటే స్కిల్స్ సుమన్ ప్రత్యేకంగా మార్చాయి. సుమన్ ఫైట్స్ కి ప్రసిద్ధి గాంచాడు.