Senior Actress Tulsi- Ali: సీనియర్ నటి తులసి నటుడు అలీపై సీరియస్ కామెంట్ చేసింది. అలీ నాకు లైన్ వేశాడని పబ్లిక్ లో ఓపెన్ అయ్యింది. పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగాకు తులసి, ప్రభాస్ శ్రీను గెస్ట్స్ గా వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు ఆమె వెల్లడించారు. నాలుగు స్తంభాలాట మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలీ నటించగా తులసి హీరోయిన్ గా నటించారు. సీనియర్ నరేష్ ఆ చిత్ర హీరో. ఈ మూవీ సమయంలో మీకు పరిచయం ఎలా అయ్యిందని ప్రభాస్ శ్రీను అలీని అడిగారు. అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ… ఆ మూవీ సెట్స్ లో అలీ నాకు లైన్ వేశాడని తులసి కామెంట్ చేసింది.

అలీ ఇంత ఉండేవాడు. కానీ పెద్ద కంత్రి. నిజంగా నాకు లైన్ వేశాడని తులసి అన్నారు. ఈ సందర్భంగా అలీ మరో ఆసక్తికర విషయం బయటపెట్టారు. నేను నిక్కర్ వేసుకొని గుండీలు పెట్టుకోలేదు. తులసి అది చూసి ”రేయ్ నువ్వు బటన్స్ పెట్టుకోలేదురా” అందని అలీ గుర్తు చేసుకున్నారు. అలీ చెప్పిన విషయానికి తులసి సిగ్గుతో నవ్వుకున్నారు. డార్లింగ్ మూవీతో మా ప్రయాణం మొదలైందని ప్రభాస్ శ్రీను తులసిని ఉద్దేశించి మాట్లాడారు. ఆలీతో సరదాగా లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.
తులసి ఈ జనరేషన్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం. కానీ ఆమె ప్రస్థానం మొదలైంది చైల్డ్ ఆర్టిస్ట్ గా. 1967లో విడుదలైన భార్య మూవీలో తులసి మూడు నెలల వయసులో స్క్రీన్ పై కనిపించారు. నటి సావిత్రికి తులసి మదర్ ఫ్రెండ్. ఆ విధంగా ఆమెకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. టీనేజ్ కి వచ్చాక తులసి హీరోయిన్ గా చేశారు. 1994 వరకు తులసి హీరోయిన్ గా అలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ వచ్చారు.

అనంతరం 2003 వరకు తులసి బ్రేక్ తీసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తులసి మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. డార్లింగ్ మూవీతో తులసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయ్యారు. ప్రభాస్ తల్లిగా బట్లర్ ఇంగ్లీష్ తో ఆమె చేసే కామెడీ బాగా హైలెట్ అయ్యింది. మిస్టర్ పర్ఫెక్ట్, జులాయి, ఇద్దరు అమ్మాయిలతో, శ్రీమంతుడు వంటి హిట్ చిత్రాల్లో తులసి క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఈ ఏడాది ఆమె నటించిన ఎఫ్ 3, కార్తికేయ 2, థాంక్యూ విడుదలయ్యాయి. కార్తికేయ 2 భారీ విజయం సాధించింది.