https://oktelugu.com/

Rajamouli – Prabhas Looks : రాజమౌళి కి ఇతర దర్శకులకు ఎంత తేడా ఉందో మీరే చూడండి!

ప్రభాస్ లుక్ అలా మారిపోవడానికి కారణం దర్శకుడి లోపమే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఇలాంటి విషయాల్లో చాలా కచ్చితంగా, ఒక అద్భుతమైన విజన్ తో ఉంటాడు కాబట్టే బాహుబలి సినిమాలో ప్రభాస్ ని అంత అద్భుతంగా చూపించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : June 18, 2023 / 02:23 PM IST
    Follow us on

    Rajamouli – Prabhas Looks : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం రీసెంట్ గానే గ్రాండ్ గా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలై ట్రోల్ల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రం లో గ్రాఫిక్స్ మరియు ప్రభాస్ లుక్స్ పై సోషల్ మీడియా లో గత మూడు రోజుల నుండి నాన్ స్టాప్ గా ట్రోల్ల్స్ పడుతూనే ఉన్నాయి.

    ముఖ్యంగా ప్రభాస్ ఒక సన్నివేశం లో తెల్ల బట్టలు వేసుకొని, యేసు క్రీస్తు లుక్ లో ఉన్న ఫోజు పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మామూలు కామెడీ చెయ్యడం లేదు. ‘ఆదిపురుష్’ లోకి యేసు క్రీస్తు ఎలా వచ్చాడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అదే సమయం లో ఇదే ఫోజులో ప్రభాస్ ఉన్నటువంటి బాహుబలి చిత్రం లోని స్టిల్ తో, ప్రభాస్ యేసు క్రీస్తు లుక్ లో ఉన్న ఫోటోని పోల్చి చూస్తూ రాజసం ఉట్టిపడేలా లాగ ఉండే ప్రభాస్, చివరికి ఇలా అయ్యిపోయాడేంటి అంటూ అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా బాధపడుతున్నారు.

    ప్రభాస్ లుక్ అలా మారిపోవడానికి కారణం దర్శకుడి లోపమే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఇలాంటి విషయాల్లో చాలా కచ్చితంగా, ఒక అద్భుతమైన విజన్ తో ఉంటాడు కాబట్టే బాహుబలి సినిమాలో ప్రభాస్ ని అంత అద్భుతంగా చూపించాడు. మళ్ళీ ప్రభాస్ తో రాజమౌళి సినిమా తీస్తే అదే రేంజ్ లో చూపిస్తాడు. అందుకే రామాయణం మరియు మహాభారతం వంటి సినిమాలు తీస్తే రాజమౌళి లాంటి దర్శకులు మాత్రమే తియ్యాలి,మిగతా వాళ్ళు అంత అద్భుతంగా తియ్యలేరు అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

    బాహుబలి తరహా లుక్స్ తో ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభంజనం ఉండేది?,అప్పట్లో రాముడు మరియు కృష్ణుడు ఎవరు అంటే ఎన్టీఆర్ అని చెప్పుకునే వాళ్ళు, నేటితరం లో రాముడు అంటే ప్రభాస్ అని చెప్పే రేంజ్ లో హిట్ అయ్యేది ఈ చిత్రం, డైరెక్టర్ ఓం రౌత్ బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు.