Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో లవ్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొంటున్నారు. ఈ సీన్స్ ఎక్కువగా మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాగుతాయట. ఈ సీన్స్ లో మహేష్ – కీర్తి మధ్య లవ్ బిల్డప్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయట.

ఇక మహేష్ బాబు తన సినిమా షూటంగ్ ఎప్పుడు విదేశాల్లో జరిగినా.. తనతో పాటు తన ఫ్యామిలీని కూడా షూట్ కి తీసుకువెళ్తాడు. ఈ క్రమంలోనే మహేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు నమ్రత, సితార,గౌతమ్ కూడా స్పెయిన్ కి వెళ్లారు. అందరూ సరదాగా గడుపుతున్నారు. అయితే, ఈ రోజు షూట్ లో మహేష్ – కీర్తి మధ్య ఒక సాంగ్ కి సంబంధించి కొన్ని మాంటేజ్ షాట్స్ తీస్తున్నారు.
కాగా నమ్రత పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ లొకేషన్ నుంచి ఒక ఫోటో తీశారు. ఆ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదిక పై పోస్ట్ చేశారు. ఇక ఈ ఫొటోలో నమ్రత, కీర్తి సురేష్ దేని గురించో ముచ్చటించుకుంటూ కనిపించారు. అయితే మహేష్ మాత్రం ఫోటోలో కనబడలేదు. మొత్తానికి స్పెయిన్ లో భారీ ఖర్చు పెట్టి ‘సర్కారు వారి పాట’ షూట్ చేస్తున్నారు. సెన్స్ బుల్ సినిమాల దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ క్రేజీ సినిమా.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగనుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా కనిపించబోతున్నాడు. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి తిరిగి మహేష్ ఆ డబ్బును ఎలా రాబట్టాడు ? ఈ క్రమంలో ఏమి చేశాడు ? అనే కోణం ఈ సినిమాలో వెరీ ఇంట్రెస్ట్ గా ఉండబోతుందట. అన్నిటికీ మించి కీర్తి సురేష్ మహేష్ కలయికలో వచ్చే ప్యూర్ రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందట.
మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ఖర్చుకు కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అన్నట్టు కీర్తి సురేష్ ఈ సినిమాలో కళావతి అనే పాత్రలో కనిపించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.