Sarkaru Vaari Paata Distributors: మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి..

అయితే ఈ సినిమా వసూళ్ల పై సోషల్ మీడియా లో మొదటి రోజు నుండే గొడవలు జరుగుతూనే ఉన్నాయి..సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కంటే రెండు రేట్లు ఎక్కువ చెప్పుకుంటున్నారు అని.. ఇలా చేసి ఏమి ప్రూవ్ చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు అని డైలీ కలెక్షన్స్ ట్రాకింగ్ చేసేవాళ్ళు , మైత్రి మూవీ మేకర్స్ పై విరుచుకుపడుతున్నారు..ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న మరో చర్చ ఏమిటి అంటే మైత్రి మూవీ మేకర్స్ తాము సిద్ధం చేసి ఇచ్చిన కలెక్షన్స్ ని మాత్రమే చెప్పాలి అని..
Also Read: Teenmar Mallanna- Puvvada: తీన్మార్ మల్లన్న రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్న మంత్రి
డిస్ట్రిబ్యూటర్స్ షేర్స్ బయటకి తెలుపరాదు అని, ఒక్కవేల నంబర్స్ బయటపెడితే మీకు వచ్చిన నష్టాలలో డబ్బులు తిరిగి ఇచ్చే సమస్యే లేదు అని సర్కారు వారి పాట సినిమా నిర్మాతల నుండి డిస్ట్రిబ్యూటర్స్ కి వార్నింగ్ వెళ్ళింది అంట..దీనితో కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతున్న ఈ సినిమా కి ఫేక్ కలెక్షన్స్ చాలా బలవంతంగా చెప్తున్నారట వాళ్ళు..బుక్ మై షో లో ఎక్కడ చూసిన ఖాళీగా కనిపిస్తున్న ఒక్క సినిమాకి, ప్రతి రోజు ఇంత కలెక్షన్స్ రావడం ఏమిటి అని ట్రేడ్ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు..
ఇక పోతే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు జరిగింది అట..ఫుల్ రన్ లో ఈ సినిమా 90 కోట్ల రూపాయిల షేర్ ని కూడా దక్కించుకునే అవకాశం కనిపించకపోవడం తో బయ్యర్లు కనీసం 30 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి..30 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు అంటే చిన్న మొత్తం కాదు..బయ్యర్లు తమ నష్టాలను పూడ్చాలి అని ప్రొడ్యూసర్స్ ని డిమాండ్ చేస్తున్నారు అట..చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్ వారు బయ్యర్స్ కి వచ్చిన నష్టాలు పూడుస్తారో లేదో అనేది.
Also Read: Star Hero: డెడ్ చీప్ అయిపోయిన హీరో.. గుర్తుపట్టగలరా ?
[…] Also Read: Sarkaru Vaari Paata Distributors: అయోమయంలో పడ్డ సర్కారు వా… […]
[…] Also Read: Sarkaru Vaari Paata Distributors: అయోమయంలో పడ్డ సర్కారు వా… […]
[…] Read:Sarkaru Vaari Paata Distributors: అయోమయంలో పడ్డ సర్కారు వా… Recommended […]