Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే ?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ ఐదో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా పై థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ లెక్కన ఈ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోబోతున్నాయి. మరోపక్క నిరాశ కలిగిస్తున్న ‘సర్కారు’ అంటూ ట్రోలర్స్ ఈ సినిమా పై దాడికి దిగారు. […]

Written By: Shiva, Updated On : May 16, 2022 5:50 pm

Sarkaru Vaari Paata

Follow us on

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ ఐదో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా పై థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ లెక్కన ఈ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోబోతున్నాయి. మరోపక్క నిరాశ కలిగిస్తున్న ‘సర్కారు’ అంటూ ట్రోలర్స్ ఈ సినిమా పై దాడికి దిగారు. సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తోన్న ట్రోలింగ్ ప‌ట్ల మహేష్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. నిజానికి ఈ సినిమా టాక్ తర్వాత.. కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి.

MAHESH BABU

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

Also Read: OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?

నైజాం 27.92 కోట్లు

సీడెడ్ 9.38 కోట్లు

ఉత్తరాంధ్ర 9.23 కోట్లు

ఈస్ట్ 6.51 కోట్లు

వెస్ట్ 4.15 కోట్లు

గుంటూరు 7.57 కోట్లు

కృష్ణా 4.94 కోట్లు

నెల్లూరు 2.90 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ 72.60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా 4.80 కోట్లు

ఓవర్సీస్ 10.15 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 4 డేస్ కలెక్షన్స్ గానూ 87.55 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

MAHESH

ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 3 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 154:10 కోట్లను కొల్లగొట్టింది

ఈ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.122 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. అయితే, సోమవారం నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమాకి 27 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేవు.

Also Read:YCP Minister: సంచలనం: ఏపీ మంత్రి రాసలీలల ఆడియో రిలీజ్ కలకలం..

Recommended Videos:

 

Tags