Homeఎంటర్టైన్మెంట్Sarangapani Jathakam Teaser: సారంగపాణి జాతకం టీజర్ రివ్యూ: మరో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ తో...

Sarangapani Jathakam Teaser: సారంగపాణి జాతకం టీజర్ రివ్యూ: మరో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్న ప్రియదర్శి!

Sarangapani Jathakam Teaser: పెళ్లి చూపులు మూవీతో కమెడియన్ గా పాప్యులర్ అయ్యాడు ప్రియదర్శి. ఆయన హీరోగా కూడా చేస్తున్నాడు. చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మల్లేశం మూవీలో ప్రియదర్శి హీరోగా నటించారు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆయన హీరోగా సమానమైన పాత్రలు చేసిన బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు మూవీస్ బ్లాక్ బస్టర్ కొట్టాయి. ముఖ్యంగా జాతి రత్నాలు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలు చేశారు.

కాగా డార్లింగ్ మూవీలో ప్రియదర్శి హీరోగా నటించారు. నభా నటేష్ హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా మరోసారి ప్రియదర్శి హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. సారంగపాణి జాతకం పేరుతో తెరకెక్కిన చిత్రంలో ఆయన హీరోగా చేశారు. ప్రియదర్శికి జంటగా రూప కొడువాయుర్ నటిస్తుంది. నరేష్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, తనికెళ్ళ భరణి కీలక రోల్స్ చేస్తున్నారు.

సారంగపాణి జాతకం విడుదలకు సిద్ధం అవుతుండగా టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రియదర్శి జాతకాల పిచ్చోడు రోల్ చేస్తున్నాడు. రాశిఫలాలు, రంగురాళ్లు, చేతి రేఖల ఆధారంగానే జీవితం ఉంటుందని నమ్మే వ్యక్తి జీవితం ఎలా సాగింది. అతనికి ఎదురైన ఇబ్బందులు ఏమిటనేది కామిక్ గా చెప్పే ప్రయత్నం జరిగింది. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు. అష్టాచెమ్మా, జెంటిల్ మెన్ వంటి హిట్ చిత్రాలతో ఫేమ్ రాబట్టాడు. ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతుంది. నాని రేంజ్ నుండి ప్రియదర్శి స్థాయికి పడిపోయింది.

మొత్తంగా టీజర్ ఆకట్టుకుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. పీజీ వింద కెమెరా మెన్ గా పని చేస్తారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటికి ఈ చిత్రం బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

 

RELATED ARTICLES

Most Popular