Sankranthiki Vastunnam : సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం నేటి తో నెల రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ విడుదలైన ప్రతీ సెంటర్ లోనూ విజయవంతంగా ఆడుతున్న ఈ సినిమా, డీసెంట్ స్థాయి హోల్డ్ ని కనబరుస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్స్ లో ఇప్పటికీ ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. నాల్గవ వారం లో నాలుగు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, ఐదవ వారం లో రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. 28 వ రోజు పాతిక లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 29 వ రోజున 20 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టినట్టు చెప్తున్నారు. ఓవరాల్ గా 29 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం ఈ సినిమా కచ్చితంగా 50 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు జీఎస్టీ రిటర్న్స్ కలిపి కేవలం 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. 50 కోట్ల బెంచ్ మార్క్ ని అందుకొని ఉండుంటే అద్భుతంగా ఉండేది. కానీ ఫుల్ రన్ లో మరో కోటి రూపాయిల షేర్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ సినిమాకి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ, 20 కోట్ల రూపాయిల షేర్ మార్కుని ముట్టుకోవడం కాస్త కష్టమే. ఈ బెంచ్ మార్కుని కూడా అందుకొని ఉండుంటే బాగుండేది అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్(Allu Arjun), ప్రభాస్(Prabhas) తప్ప ఇప్పటి వరకు ఈ ప్రాంతం లో ఎవ్వరూ కూడా 20 కోట్ల రూపాయిల మార్కుని ముట్టుకోలేదు, వెంకటేష్(Victory Venkatesh) ఆ మార్కుకి దగ్గరగా వచ్చి ఆగిపోయాడు.
అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈస్ట్ గోదావరి లో 14 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 9 కోట్లు, గుంటూరు జిల్లాలో 10 కోట్లు, కృష్ణ జిల్లాలో 9 కోట్ల 60 లక్షలు, నెల్లూరు జిల్లాలో నాలుగు కోట్ల 80 లక్షలు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 9 కోట్లు, ఓవర్సీస్ లో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 29 రోజుల్లో 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 280 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.