Sankranthiki Vastunnam and Vakeel Saab : ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam Movie) చిత్రాన్ని మార్చి 1వ తేదీన జీ తెలుగు లో టెలికాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇలాంటి క్రేజీ చిత్రాలను ఆదివారం రోజున టెలికాస్ట్ చేస్తుంటారు. కానీ ఎందుకో ఈసారి శనివారం రోజున టెలికాస్ట్ చేసారు. అది కూడా ఆరోజు ప్రసారం అయ్యే సీరియల్స్ అన్నిటిని ఆపి మరీ టెలికాస్ట్ చేసారు. రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్(TRP Ratings) వస్తుందని ఆశించారు కానీ, 15.92 రేటింగ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా టెలికాస్ట్ అయిన రోజే జీ5 ఓటీటీ యాప్ లో కూడా టెలికాస్ట్ చేసారు. దీంతో ఆడియన్స్ డివైడ్ అయ్యారు. ఆరోజు ఓటీటీ లో 12 లక్షల మంది ఈ చిత్రాన్ని వీక్షించారట.
Also Read : అక్షరాలా 300 మిలియన్లు..వరల్డ్ రికార్డుని నెలకొల్పిన ‘సంక్రాంతికి వస్తున్నాం’..దరిదాపుల్లో మరో సినిమా లేదు!
దాని ప్రభావం కూడా రేటింగ్స్ పై పడి ఉండొచ్చు, లేకపోతే ఆల్ టైం రికార్డు ని క్రియేట్ చేసేదని విశ్లేషకులు అంటున్నారు. కరోనా తర్వాత జీ తెలుగు లో ప్రసారమైన సినిమాలలో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సాధించిన చిత్రం గా ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘వకీల్ సాబ్’ చిత్రం(Vakeel Saab Movie) రికార్డు చెక్కు చెదరకుండా ఉన్నది. ఈ చిత్రానికి అప్పట్లో 19.20 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. థియేటర్స్ లో కరోనా కారణంగా పది రోజులకే థియేటర్స్ ని మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. దాదాపుగా సంవత్సరం పాటు ట్రెండ్ అయ్యింది. టీవీ లో ఓటీటీ లో విడుదలైన వంద రోజుల తర్వాత టెలికాస్ట్ చేసారు. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
కరోనా తర్వాత కేవలం ‘పుష్ప’ చిత్రానికి మాత్రమే ‘వకీల్ సాబ్’ కంటే ఎక్కువ రేటింగ్స్ వచ్చింది. మిగిలిన సినిమాలన్నీ ‘వకీల్ సాబ్’ కంటే తక్కువ టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నీరాజనం పలికిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కచ్చితంగా ‘వకీల్ సాబ్’ ని కొడుతుందని అనుకున్నారు కానీ, అది జరగకపోవడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయాన్నీ గుర్తు చేస్తూ సోషల్ మీడియా లో సంబరాలు చేసుకుంటున్నారు. జీ తెలుగు లో ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రం నెంబర్ 1 స్థానం లో ఉండగా, ఆ తర్వాత మహేష్ బాబు శ్రీమంతుడు, విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక నాల్గవ స్థానంలో ‘వకీల్ సాబ్’ చిత్రం నిల్చింది. ఈ స్థానాలు భవిష్యత్తులో కూడా మారడం కష్టమే అనొచ్చు.
Also Read : వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?