Sankranthiki Vastunnam : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం విజయం సాధించి దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam). విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న వెంకటేష్ కి మంచి బూస్ట్ ని ఇచ్చింది ఈ చిత్రం. చాలా మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం వెంకటేష్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి అద్భుతమైన టేకింగ్ తో పాటు సీజన్ కూడా బాగా కలిసొచ్చింది. దానికి తోడు భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కి హద్దులే లేకుండా పోయింది.
అలాంటి సినిమాని ఇప్పుడు హిందీ లో రీమేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఈ సినిమా రీమేక్ లో నటించేందుకు ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తున్నాడు. ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు నుండి రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసినట్టు సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాలు కేవలం కొంతమంది హీరోల వల్లే సూపర్ హిట్ అవుతుంది. ఆ మ్యాజిక్ ని వేరే హీరోలు రిపీట్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఆ కామెడీ వర్కౌట్ అవ్వడం అసాధ్యం. అలాంటి సినిమాని రీమేక్ చేయాలనీ అనుకోవడం కత్తి మీద సాము లాంటిదే. పైగా ఎంత బాగా తీసిన రీమేక్ సినిమాలను ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్ ఆదరించడం లేదు. ఇలాంటి సమయం లో ఇలాంటి చిత్రాన్ని రీమేక్ చేయడం చాలా తప్పు ఛాయస్ అని అంటున్నారు విశ్లేషకులు.
అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరో, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వెంకటేష్ కి మించిన కామెడీ టైమింగ్ అంటే కష్టమే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని నిలబెట్టడానికి ఆయన కామెడీ టైమింగ్ ఒక కారణం అయితే, సినిమాలోని పాటలు కూడా మరో కారణం అనుకోవచ్చు. అలాంటి పాటలు బాలీవుడ్ లో వర్కౌట్ అవ్వడం కష్టమే. ఎటు వైపు చూసిన ఈ రీమేక్ క్లిక్ అవ్వడం చాలా కష్టం, చూడాలి మరి ఏమి చెయ్యబోతున్నారు అనేది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ వరుస హిట్స్ తో మంచి ఊపులో ఉన్నాడు. ఆ ఊపులో ఈ సినిమా కూడా హిట్ అవ్వుదేమో అని కొంతమంది విశ్లేషకులు ఆశిస్తున్నారు.