Akkineni Amala- Sanjay Kapoor: బెంగాల్ కి చెందిన అక్కినేని అమల తండ్రి ఇండియన్ కాగా తల్లి ఐరిష్ లేడీ. 80లలో అమల కెరీర్ మొదలైంది. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగా నాగార్జున ప్రేమలో పడింది. వీరిద్దరి కాంబోలో కిరాయి దాదా, శివ, నిర్ణయం వంటి సినిమాలు తెరకెక్కాయి. అప్పుడే ఒకరికొకరు దగ్గరయ్యారు. నాగార్జునకు అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకుని ఉన్నారు. 1992లో అమలను రెండో వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక అమల యాక్టింగ్ మానేశారు. పక్కా మోడరన్ సొసైటీలో పెరిగిన అమల తెలుగింటి కోడలిగా అందరి మన్ననలు పొందారు.
వీరికి అఖిల్ సంతానం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అమల క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఆమె సోషల్ యాక్టివిస్ట్ కూడాను. కాగా పెళ్లికి ముందు అమల బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేశారు. ఈ క్రమంలో ఆమెను సంజయ్ కపూర్ డెబ్యూ మూవీకి హీరోయిన్ గా ఎంపిక చేశారట. సంజయ్-అమల మీద ఫోటో షూట్ కూడా జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో ఆగిపోయింది. ఈ విషయాన్ని సంజయ్ కపూర్ తాజాగా గుర్తు చేసుకున్నారు.
సంజయ్ కపూర్ అమలతో అప్పుడు దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 1987లో బ్యూటిఫుల్ అమలతో నా ఫస్ట్ ఫోటో షూట్. ఆమె నా డెబ్యూ మూవీ హీరోయిన్ కావాల్సింది. అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని కామెంట్ చేశాడు. సంజయ్ కపూర్ ఫస్ట్ మూవీకి అమల హీరోయిన్ కావాల్సి ఉండగా అది జరగలేదు. అప్పటి జ్ఞాపకాలు సంజయ్ కపూర్ గుర్తు చేసుకున్నారు.
సంజయ్ కపూర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై ఆయన భార్య స్పందించడం విశేషం. 1987లోనా… అప్పటికి నా వయసు కేవలం 14 ఏళ్ళు అంటూ ఆమె కామెంట్ చేశారు. సంజయ్ కపూర్ పోస్ట్ వైరల్ అవుతుంది. అనంతరం 1995లో ప్రేమ్ అనే సినిమాతో సంజయ్ కపూర్ హీరో అయ్యారు. అంటే హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న 8 ఏళ్లకు ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. సంజయ్ కపూర్ స్టార్ కాలేకపోయారు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More