Sandeep Reddy Vanga: సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కి ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఉన్న డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సైతం సాయనతో సినిమాలు చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆయన లైనప్ చాలా పెద్దదిగా ఉంది. ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ చేస్తున్న సందీప్ వంగ, ఆ చిత్రం తర్వాత ఎవరితో ఎవరితో చేయబోతున్నాడు అనే దానిపై స్పష్టమైన క్లారిటీ ఉండేది కాదు. రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడని కొందరు, మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడని మరికొందరు ప్రచారం చేశారు. అల్లు అర్జున్ తో అసలు సినిమా ఉండే అవకాశమే లేదు, ఇద్దరి మధ్య ఎక్కడో చిన్నపాటి క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడింది అనే ప్రచారం కూడా జోరుగా సాగింది. పైగా అల్లు అర్జున్ పుట్టినరోజు కి సందీప్ వంగ శుభాకాంక్షలు తెలపకపోవడం తో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి.
అయితే అందులో ఎలాంటి నిజం లేదని సందీప్ వంగ ఆస్థాన నిర్మాత T భూషణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. స్పిరిట్ చిత్రం పూర్తి అవ్వగానే సందీప్ వంగ ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ చేస్తాడని, ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా ఉంటుందని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ రెండు సినిమాలో ఏది ముందు మొదలు అవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. భూషణ్ కుమార్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా ల హాట్ టాపిక్ గా మారింది. సందీప్ వంగ లైనప్ పై అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ కూడా వచ్చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. మరోపక్క రీసెంట్ గానే ఆయన లోకేష్ కనకరాజ్ తో మరో సినిమాని ఒప్పుకున్నాడు. ఈ ఏడాది లోనే ఆ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే అల్లు అర్జున్, సందీప్ వంగ సినిమా ఉంటుంది. అంటే వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు అన్నమాట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
#Confirmed :#SandeepReddyVanga to direct #AlluArjun after #Spirit
Confirmed by T-Series Bhushan Kumar…If things fall in place it would be #AA25— Taraq(Tarak Ram) (@tarakviews) January 25, 2026