Prabhas Spirit movie updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే దర్శకులు సైతం వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకుడు స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక అతనితోపాటు సందీప్ రెడ్డి వంగా సైతం హీరోలకు ఏ రేంజ్ అయితే ఉంటుందో తనకి కూడా అలాంటి క్రేజ్ అయితే దక్కుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన తీసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో చేసిన ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశాడు. అనిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ ను డిఫరెంట్ యాంగిల్ లో చూపించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి అందులో భాగంగానే ఆయన చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఆర్ ఆర్ ను 70% పూర్తి చేశారట.
మరి ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నింటి విషయంలో సినిమా అయిపోయిన తర్వాత ఆర్ ఆర్ (బ్యాగ్రౌండ్ మ్యూజిక్) రికార్డ్ చేయించిన ఆయన ఇప్పుడు సీన్స్ రాసుకుంటున్నప్పుడే ఆ సీన్లకు తగ్గట్టుగా ఆర్ఆర్ అయితే సెట్ చేసి పెడుతున్నారట. దీనివల్ల సినిమా మీద భారీ ఇంపాక్ట్ రావడమే కాకుండా ఆ సీన్స్ ని తెరకెక్కిస్తున్నప్పుడు సెట్ లో ఆర్ ఆర్ పెట్టి ఆ సీన్స్ ని తెరకెక్కించడం వల్ల ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందనే ఉద్దేశ్యంతోనే సందీప్ ఇలాంటి ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ సినిమాతో ప్రభాస్ కి ఆల్ టైం సూపర్ హిట్ సినిమాని ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదంతా చూసిన సందీప్ రెడ్డి వంగ అభిమానులు మాత్రం మా డైరెక్టర్ ఇతర దర్శకులు మాదిరిగా రొటీన్ వే లో వెళ్ళడు. ఏది చేసిన డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే ఆర్ ఆర్ కంప్లీట్ చేశాడు అంటే మామూలు విషయం కాదు అంటూ సందీప్ రెడ్డి వంగానే ఆకాశానికి ఎత్తేస్తున్నారు…