Sandeep Reddy Vanga Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వైవిద్య భరితమైన సినిమాలను చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ మాత్రం కొత్త కోణంలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గొప్ప క్రేజ్ ను అయితే సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో గొప్ప సినిమా తీయబోతున్నాను అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న స్పిరిట్ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది అంటూ ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక తను ఇంతకుముందు చేసిన సినిమాలను మీద ట్రోల్ చేసిన వారందరు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని చూసి షాక్ అవుతారని, ఆయన క్యారెక్టరైజేషన్ ను డిఫరెంట్ గా తీర్చిదిద్దినట్టుగా తెలియజేశాడు.
Also Read: లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ముందు ‘మౌళి’ నెల సంపాదన ఎంతో ఉండేదో తెలుసా..?
మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇంతకుముందు చేసిన అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాల్లో బోల్డ్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది ప్రేక్షకులు అతని సినిమాలను చూడడానికి ఇష్టపడడం లేదు. అలాగే మరి కొంతమంది బోల్డ్ సినిమాలు తప్ప సందీప్ రెడ్డివంగ వేరే సినిమాలు చేయలేడు అంటూ అతన్ని ట్రోల్ చేశారు.
ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. స్పిరిట్ సినిమా అనేది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సినిమాగా తెరకెక్కబోతోంది. ఇందులో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు. తద్వారా ఆయనకి ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాల్సి ఉంది…
ఒకవేళ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఈ మూవీ 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతుండటం తో ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ప్రభాస్ కి వీరాభిమానులుగా మారిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు అంటూ సందీప్ చెబుతుండటం విశేషం…