Sandeep Reddy Vanga : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక దర్శకులు అయితే హీరోలకు మంచి సినిమాలను అందించడమే కాకుండా వాళ్లు కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్లుగా కొనసాగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు అర్జున్ రెడ్డి సినిమాతో ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) దర్శకుడిగా రాణించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమాతో ఒక్కసారిగా తను అటెన్షన్ ను క్రియేట్ చేశాడు. ముఖ్యంగా బోల్డ్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను కొట్టొచ్చు అనే ధోరణిలో ఆయన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ సాధించి చూపించాడు. మరి ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డి వంగ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తున్నప్పటికి బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికప్పుడు అతని మీద వ్యతిరేకత అయితే పెరుగుతుంది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ కొంతవరకు తక్కువగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మీదనే ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి కంటెంట్ ని ఎంచుకుంటాడు. తద్వారా ఆయన చేయబోతున్న సినిమాలు ప్రేక్షకులను ఎలా మెప్పించబోతున్నాయి. అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక బాలీవుడ్ మాఫియా మాత్రం సందీప్ రెడ్డివంగ ను ఇప్పటికి వదిలిపెట్టడం లేదు.
Also Read : సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు కాంబోలో సినీమా వచ్చే అవకాశాలు ఉన్నాయా..?
ఆయన డైరెక్షన్ లో ప్రభాస్ (Prabhas) హీరోగా రాబోతున్న స్పిరిట్ సినిమా గురించి ఇప్పటి నుంచే నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడుని బాలీవుడ్ మాఫియా ఇబ్బంది పెడుతుంది. మరి తన తదుపరి సినిమాతో ఆయన వాళ్లకు ఎలాంటి సమాధానం చెబుతాడు తద్వారా ఆయనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటికే ఆయన పేరు చెబితే బాలీవుడ్ మాఫియా భయపడుతున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఆయన మరోసారి తన సినిమాతో వాళ్ళకి సమాధానం చెబుతా అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట.
Also Read : స్పిరిట్ సినిమాలో కొత్త ప్రభాస్ ను చూడబోతున్నారు : సందీప్ వంగ…