Site icon OkTelugu

Sandeep Raj: వెండితెర నన్ను ద్వేషిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ‘కలర్ ఫోటో’ దర్శకుడు..ట్వీట్ వైరల్!

Sandeep Raj

Sandeep Raj

Sandeep Raj: సోషల్ మీడియాలో పాపులారిటీ ని సంపాదించి సినిమాల్లో అవకాశాలు పొందడం అంత తేలికైన విషయం కాదు. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు కొంతమంది సెలబ్రిటీల జీవితాల్లో జరిగాయి. అందులో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒకరు కాగా, కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ మరొకరు. వైష్ణవి చైతన్య యూట్యూబ్ లోని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించి, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, చివరికి ‘బేబీ’ మూవీ లో హీరోయిన్ గా నటించి, భారీ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. వరుసగా క్రేజీ ఆఫర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇక సందీప్ రాజ్ అయితే ‘కలర్ ఫోటో’ చిత్రం ద్వారా నేషనల్ అవార్డు ని అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించాడు.

ఇప్పుడు రీసెంట్ గా ఆయన యాంకర్ సుమ కొడుకు రోషన్ తో ‘మోగ్లీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ చిత్రం ఈ నెల 12న విడుదల అయ్యేది. కానీ ఆరోజున నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల కాబోతుండడం తో మోగ్లీ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో తీవ్రమైన దిగ్బ్రాంతికి గురైన సందీప్ రాజ్, నిన్న రాత్రి ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘ కలర్ ఫోటో, మోగ్లీ చిత్రాలకు నాకన్నా వేరే దర్శకుడు అర్హుడు అని నేను భావిస్తున్నాను. సినిమా మీద ఎంతో పిచ్చి తో ఉన్న టెక్నీషియన్స్ ఈ రెండు సినిమాల్లో భాగమయ్యారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి అంతా చక్కగా జరుగుతుందని అనుకుంటే, సరిగ్గా విడుదల సమయం లో ఎదో ఒక అడ్డంకి ఎదురు అవ్వడం. రెండు నా దురదృష్టం. డైరెక్టర్ గా వెండితెర పై నా పేరుని చూసుకోవాలని అనుకున్న నా చిరకాల కల, కలగానే మిగిలిపోతుందేమో అనే భయం ఇప్పుడు నన్ను వెంటాడుతుంది. బహుశా వెండితెర నన్ను ద్వేషిస్తుందేమో. ఈ చిత్రం కోసం రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, DOP మారుతీ, సంగీత దర్శకుడు కాల భైరవ ఎంతో కష్టపడ్డారు. కనీసం వారి కోసమైనా ఈ సినిమా విషయం లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రాజ్.

దీనికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ ‘ఒక నేషనల్ అవార్డు ని సంపాదించిన సినిమాకు దర్శకుడు మీరు. సినీ ప్రయాణం లో ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి, అవి తాత్కాలికం, దిగులు చెందొద్దు. మీ కష్టాన్ని కచ్చితంగా ప్రేక్షకులు గుర్తించి, మీకు మద్దతు తెలుపుతూ అండగా నిలుస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రాజ్.

Exit mobile version