Sandeep Kishan
Sandeep Kishan : యంగ్ హీరోలలో స్టార్ అవ్వడానికి అన్ని విధాలుగా అర్హత ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో సందీప్ కిషన్(Sandeep Kishan) ముందు వరుసలో ఉంటాడు. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈయన ఇప్పటి వరకు 30 సినిమాలు చేసాడు. అందులో కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యినవి పట్టుమని మూడు సినిమాలు కూడా లేవు. అయినప్పటికీ సినిమాల్లో ఇతనికి హీరోగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అందుకు కారణం నిర్మాతల్లో కచ్చితంగా ఇతను ఎప్పుడో ఒకసారి పెద్ద హిట్ కొడుతాడు, పెద్ద రేంజ్ కి వెళ్తాడు అనే నమ్మకం ఉండడం వల్లే. మంచి స్క్రిప్ట్ దొరికితే నిజంగే పెద్ద హిట్ కొట్టే సత్తా ఇతనిలో ఉంది. కానీ అలాంటి స్క్రిప్ట్స్ దొరకడం లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ కుర్ర హీరో ట్రాక్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన గత చిత్రం ‘భైరవకోన’ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అనిపించుకుంది.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘మజాకా'(Majaka Movie) చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ‘ధమాకా’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ప్రొమోషన్స్ కాస్త సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్ అతిగా అనిపించింది. సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రానికి ఆ మూవీ టీం చేసిన ప్రొమోషన్స్ చాలా ఉపయోగపడ్డాయి. ఆ స్టైల్ ని అనుసరించే ప్రయత్నం ‘మజాకా’ టీం చేస్తుంది కానీ, అవి క్లిక్ అవ్వడం లేదు. క్లిక్ అయ్యే సంగతి పక్కన పెడితే మీ సినిమాలో కూడా ఇదే తరహా కుళ్ళు కామెడీ ఉంటుందా అని నెటిజెన్స్ అంటున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ రీసెంట్ గా సందీప్ కిషన్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు చాలా కాలం నుండి ఉన్న అనారోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘నాకు చాలా కాలం నుండి సైనస్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్య ఉంది. నేను నిద్రపోయే సమయంలో నా ముక్కు నుండి లోపలి భాగం వరకు మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోజు ఉదయం నిద్ర లేవగానే కాసేపటి వరకు ఎవ్వరితోనూ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. కచ్చితంగా నా ముక్కుకి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సర్జరీ చేయించుకుంటే నా ముక్కు షేప్ మారిపోతుందేమో అని భయపడుతున్నాను. వరుసగా సినిమాలు ఉన్నాయి, ఆపరేషన్ చేయించుకుంటే కొన్నాళ్ల పాటు కచ్చితంగా షూటింగ్స్ కి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే చేయించుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.