Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ కీలకం. ప్రతి సోమవారం ఇంటి సభ్యులు అక్కడ ఉండటానికి అర్హత లేదని భావించే ఇద్దరిని నామినేట్ చేస్తారు. మెజారిటీ హౌస్ మేట్స్ తిరస్కరణకు గురైన సభ్యులు నామినేట్ అవుతారు. నామినేషన్ లో ఉంటే స్ట్రాంగ్ ప్లేయర్ కి గ్యారంటీ లేదు. ఎందుకంటే నామినేషన్స్ లో ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అనే దాని మీద ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్స్ లో లేని వీక్ ప్లేయర్ కూడా ఆ వారానికి సర్వైవ్ అవుతాడు.
అందుకే నామినేషన్ లోకి రాకూడదు. హౌస్ మేట్స్ ఓట్లు వేయకుడని కంటెస్టెంట్స్ కోరుకుంటారు. ఒకటి రెండు వారాలు నామినేషన్స్ నుండి తప్పించుకున్నా… నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లోకి రావడం దాదాపు ఖాయం. అయితే ఈ వారం ఓ కంటెస్టెంట్ నామినేషన్స్ లోకి రాకుండా దాదాపు ఎనిమిది వారాలు సర్వైవ్ అయ్యాడు. ఇదో రికార్డు. అది ఎవరో కాదు ఆట సందీప్.
గత సీజన్స్ కి భిన్నంగా బిగ్ బాస్ పవర్ అస్త్ర కాన్సెప్ట్ తెచ్చాడు. గతంలో మొదటి వారం నుండే కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యేది. ఆ కెప్టెన్సీ టాస్క్ కి బదులు పవర్ అస్త్ర టాస్క్ పెట్టాడు. అది గెలిచిన వాళ్లకు ఏకంగా ఐదు వారాల ఇమ్యూనిటీ దక్కింది. ఫస్ట్ పవర్ అస్త్ర గెలిచిన సందీప్ ఐదు వారాలు హ్యాపీగా గడిపేశాడు. టాస్క్ లలో కూడా సంచాలక్ గా వ్యవహరిస్తూ రిలాక్స్ అయ్యాడు. ఇమ్యూనిటీ ముగిశాక ఆరో వారం నామినేట్ అయ్యాడు.
అప్పుడు కూడా అదృష్టం సందీప్ తలుపు తట్టింది. సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన గౌతమ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఈ పవర్ తో ఒకరిని నామినేషన్స్ నుండి సేవ్ చేయవచ్చు లేదా ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. నామినేట్ అయిన సందీప్ ని సేవ్ చేశాడు. అలా ఆరవ వారం ఎస్కేప్ అయ్యాడు. ఏడవ వారం ఒక్క ఓటు మాత్రమే పడింది. సింగిల్ ఓట్స్ ని బిగ్ బాస్ కన్సిడర్ చేయలేదు. దీంతో 7వ వారం కూడా సేఫ్… అలా ఒక్క నామినేషన్ లేకుండా సందీప్ 8 వారాల వరకు వచ్చాడు.