Writer Movie: ఓ కామెడీ పండించే పాత్రైనా, విలన్‌గా భయపెట్టాలన్నా.. సెంటిమెంట్‌తో ఏడిపించాలన్నా.. ఏ పాత్రైనా సరే అందులో తనను తాను మర్చిపోయి ఇట్టే ఒదిగిపోయే నటుడు సముద్రఖని. తాజాగా ఈ విలక్షణ నటుడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా రైటర్. పా. రంజిత్ సమర్పణలో నీలమ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్లాంక్లిన్ జాకబ్దర్శకత్వంలో వస్తోన్న సినమా ఇది. ఓ పోలీస్ స్టేషన్లో సాధారణ రైటర్‌గా చేరిన సుముద్రఖని పోలీసు వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను, రాజకీయ వ్యవస్థలోని అరాచకాలను చూసి ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే ఈ సినిమా కథాంశం.

ఇప్పటి వరకు పోలీసు కథాంశాలతో చాలానే వచ్చాయి.. కానీ ఓ రైటర్‌పై సినిమా తెరకెక్కించడం ఇదే తొలిసారి. అయితే, ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. డిసెంబరు 15న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కాగా, ఇటీవలే ఆకాశవాణి సినిమాతో వచ్చిన సముద్రఖని.. అందులో అడవిలో జీవించేవారి జీవితంలో వెలుగులు నింపే వ్యక్తి పాత్రలో కనిపించారు. కొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. కాగా, కఠారి కృష్ణగా క్రాక్ సినిమాలో కనిపించి విలన్ అంటే ఇలా ఉండాల్రా అన్నట్లు నటించారు. ఇక జయమ్మతో లవ్‌ట్రాక్ కూడా అందర్నీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు సముద్రఖని.