Samantha Instagram Post: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ఈమధ్య కాలం లో ఈమె ఎక్కువగా మెడికల్ కేరింగ్ గురించి తన అభిమానులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఈమెకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయో, ఏమో తెలీదు కానీ, జీవితానికి సంబంధించి కొన్ని క్వాట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. అవి ఒక్కోసారి ఆమె మాజీ భర్తా నాగ చైతన్య ని ఉద్దేశించి చేసినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె ప్రేమ గురించి తన అనుభవాన్ని ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకుంది. ఇది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె వేసిన ఈ పోస్ట్ చూస్తే ఈమెకు నాగ చైతన్య బాగా గుర్తుకు వస్తున్నాడేమో అని అనిపించక తప్పదు. అంతలా ఆమె ఏమి మాట్లాడిందో చూద్దాం.
ఆమె మాట్లాడుతూ ‘ మన జీవితం లో 20వ సంవత్సరం లో కలిగే ప్రేమలో ఉన్న స్వచ్ఛత, 30 వ సంవత్సరం లో ప్రేమలో పడినప్పుడు కనిపించదు. జీవితం లో స్వచ్ఛమైన ప్రేమ దొరికేది 20 వ సంవత్సరం లో ఉన్నప్పుడే’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె 20 లో ఉన్నప్పుడు నాగ చైతన్య తోనే ప్రేమలో పడింది. ఎన్నో ఏళ్ళ వరకు డేటింగ్ చేస్తూ వచ్చిన ఈమె, 2017 లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. అంటే 20 లలో దొరికే ప్రేమ స్వచ్ఛమైనది అంటే, నాగ చైతన్య తో ఉన్న రిలేషన్ స్వచ్ఛమైనది అని ఈమె పరోక్షంగా చెప్తుందా? అనే సందేహాలు అభిమానుల్లో కలిగింది. 30 లలో కలిగే ప్రేమ సంబంధాల్లో స్వచ్ఛత ఉండదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత వయస్సు 30 లలోనే ఉంది. ఈమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో ప్రేమాయణం నడుపుతుంది.
ప్రస్తుతానికి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న వీళ్లిద్దరు ఏ క్షణం లో అయినా పెళ్లి చేసుకోవచ్చు. 30 లలో వచ్చే ప్రేమలో స్వచ్ఛత ఉండదు అని అంటుంది కాబట్టి, ఈమె రాజ్ నిడిమోరు తో రిలేషన్ పై సంతృప్తి గా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. ఏది ఏమైనా సమంత కూడా నాగ చైతన్య లాగ రాజ్ ని పెళ్ళాడి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే విధంగా రాజ్ నిడిమోరు దర్శకత్వం వహిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తుంది.