Samantha Yashoda: ఆమె యూ టర్న్ సినిమాలో నటించినప్పుడు “అబ్బే సినిమా అవకాశాలు తగ్గాయి అందుకే లేడీ ఓరియంటెడ్ బాట పట్టింది” అన్నారు. ఓ బేబీ అనే సినిమాలో నటిస్తే “ఇక సమంత పని అయిపోయిందని” అందరూ నొసలు చిట్లించారు. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ తేలిపోయాడు. శ్రీలక్ష్మి తడబడింది ఆమె నటన దెబ్బకు యూఎస్ మార్కెట్లో 4 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఆమె అనకపోవచ్చు కానీ.. ఇప్పుడు చెప్పండి రా.. వాట్ టు డు వాట్ నాట్ టు డు అనే అర్థం వచ్చేలా మాట్లాడింది.. ఈలోగా చై తో విడాకులు అయ్యాయి. అయితే ఏంటి.. అని ఆమెకామే అనుకుంది. బూడిదలో నుంచి లేచిన ఫినిక్స్ పక్షిలా ఎగిరింది. నవ్విన నాప చేనే పండుతుంది కదా!

అన్నట్టుగానే ఆమె యశోదతో మళ్ళీ మన ముందుకు వచ్చింది. ఈసారి బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నట్టుగా చెలరేగిపోయింది. ఉన్ని ముకుందన్ ఉండొచ్చు. వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ వంటి వారు పోటీ ఇవ్వచ్చు. కానీ సమంతే నట విశ్వరూపం చూపింది. సినిమా మొత్తాన్ని మోసింది. ఫైట్లు, హవా భావాలు, కన్నీళ్లు పెట్టే సన్నివేశాలు.. ఒక్కటేమిటి అన్నింటిలో ఆమె ముద్ర కనిపించింది. అసలు ఈమెకు మయోసైటీస్ నిజంగానే సోకిందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా నటించింది. మొత్తానికి శుక్రవారం గెలిచేసింది.
ఇదే రోజు అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అని ఒక సినిమా విడుదలైంది.. ఈ సినిమా విడుదలైనట్టు నరేష్ కైనా తెలుసో లేదో? ఓ ప్రచారం లేదు. సినిమా గురించి పబ్లిసిటీ లేదు. నరేష్ అంతకుముందు నాందిలో నటించవచ్చు.. అది ప్రేక్షకుల మదిని గెలిచి ఉండవచ్చు. కానీ ఎప్పుడొస్తున్నాం అనేది ప్రేక్షకులకు చెప్పాలి కదా. అసలే ఇవి యూట్యూబ్ రోజులాయే.. పైగా తమిళ్ రాకర్స్ విజృంభిస్తున్న రోజులు కూడా.. ఇలాంటి సమయంలో మన చేసింది చెప్పకపోతే ఎవరు చూస్తారు? పాపం నరేష్ నాందితో గాడిలో పడ్డాడు అనుకుంటే.. మారేడుమిల్లితో మళ్లీ అడవిలోకి వెళ్ళాడు. ఈసారి ఎప్పుడు మళ్లీ జనజీవన స్రవంతిలో కలుస్తాడో

మార్వెల్ స్టూడియోస్ గురించి ఓ సెక్షన్ ప్రజలకు బాగా తెలుసు. మన దగ్గర రాజమౌళి బాహుబలి తీసినట్టే.. అక్కడ కూడా ఆ స్టూడియో సీక్వెల్ సినిమాలు తీస్తూ ఉంటుంది. శుక్రవారం అలా విడుదలైంది బ్లాక్ పాంథర్. మల్టీప్లెక్స్ లో దుమ్ము రేగ్గొడుతోంది. కానీ బి,సి సెంటర్లో సమంతనే హవా చూపిస్తోంది. మొత్తానికి ఈ శుక్రవారాన్ని గెలిచింది. అట్లనే ఇప్పుడు ఆమెతో బీమారితో బాధపడుతోంది. ఆ బీమారిని కూడా ఇట్లనే గెలవాలని మనందరం కోరుకుందాం.