Samantha: సమంత ఆధారాలతో సహా దొరికిపోయారు. ఆమె లేటెస్ట్ వీడియో పుకార్లకు నిదర్శనంగా నిలిచింది. పైగా జరుగుతున్న ప్రచారం పై ఆమె మౌనం వహించడంతో నిజమేనని అందరూ ఫిక్స్ అవుతున్నారు. సమంత బోల్డ్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చినట్లు బ్రతకడమే ఫిలాసపీగా పెట్టుకుంది. అలాగే మనసులో ఉన్నది ఏదైనా కుండబద్దలు కొట్టేస్తుంది. సొసైటీ ఏమనుకుంటుంది అనేది సమంతకు అనవసరం. పెళ్లయ్యాక సమంత చేసిన కొన్ని పాత్రలు చూసి అభిమానులు కూడా నొచ్చుకున్నారు. ఇక పబ్లిక్ ఈవెంట్స్ కోసం ఆమె ధరించిన బట్టలు వివాదాస్పదం అయ్యాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే సమంత సంచలనాలు చాలా ఉన్నాయి. స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న దేన్నైనా సమంత పక్కన పెట్టేస్తుంది. నాగ చైతన్యతో విడాకులు ఆ కారణంగానే అయ్యాయని సమంత పరోక్షంగా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం సమంత మరింత స్వేచ్ఛా జీవి. ఆమెను ఆపడానికి ఎవరూ లేరు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఆమె కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సమంత సర్జరీ చేయించుకున్నారంటూ వార్తలు వస్తుండగా… వీడియోతో స్పష్టత వచ్చింది.
సమంత చేసిన ఒక యాడ్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో సమంతను చూసిన జనాలు షాక్ అయ్యారు. ఆమె ముఖం పూర్తి భిన్నంగా కనిపించింది. సమంతకు డూప్ అన్నట్లు ఆమె ముఖం ఉంది. దీంతో సమంత అమెరికా ప్రయాణం వెనుక రహస్యం ఇదే అంటూ టాలీవుడ్ వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చారు. కొద్దిరోజుల క్రితం సడన్ గా అమెరికా వెళ్లిన సమంత, కొన్నాళ్లు ప్రపంచానికి కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో పోస్ట్స్ వేయలేదు.

దీంతో ముఖానికి సర్జరీ చేయించుకున్న సమంత అజ్ఞాతంలో ఉన్నారన్న వాదన తెరపైకి వచ్చింది. సమంత సర్జరీకి పాల్పడ్డారని చెప్పడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రెండు రోజులుగా సర్జరీ వార్తలు చక్కర్లు కొడుతున్నా సమంత కానీ ఆమె టీం కానీ నోరు విప్పలేదు. ఎలాంటి కామెంట్స్ చేయకుండా మౌనం వహిస్తున్నారు. ఇక సర్జరీ తర్వాత సమంత ముఖం భిన్నంగా ఉంది, అలాగే ఆమె సహజంగా సంక్రమించిన అందాన్ని పోగొట్టుకున్నారనిపిస్తుంది. ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద నవంబర్ 11న విడుదల కానుంది. విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.