Samantha- Vijay Devarakonda: సమంత పెళ్లి కూతురిగా దర్శనమిచ్చారు. పట్టుబట్టల్లో మెరిసిపోయారు. ఆమె పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు. ఖుషి సినిమా షూట్ లో భాగంగా జరుగుతున్న పెళ్లి. సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర పతాక సన్నివేశాలు ద్రాక్షారామంలో చిత్రీకరిస్తున్నారు. అక్కడ విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
ఆన్ సెట్స్ నుండి విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాల వీడియోలు లీకైంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సన్నివేశంలో మురళీ శర్మను కూడా మనం చూడొచ్చు. ఇది చివరి షెడ్యూల్ అని సమాచారం. దీంతో చిత్రీకరణ కంప్లీట్ అవుతుందట. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సెప్టెంబర్ 1న మూవీ విడుదల. చాలా కాలం తర్వాత సమంత రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ, సమంత రెండోసారి జతకట్టారు. మహానటి మూవీలో వీరిద్దరూ ప్రేమికులుగా కనిపించారు. ఈసారి పూర్తి స్థాయిలో రొమాన్స్ కురిపించనున్నారు. కాగా ఈ చిత్రం తర్వాత సమంత విరామం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఏడాది పాటు సమంత కొత్త చిత్రాలకు సైన్ చేయరట. ఆమె విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారట. అలాగే అనారోగ్యం సమస్యల నుండి బయటపడేందుకు చికిత్స తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
ఖుషితో పాటు సమంత సిటాడెల్ అంటే యాక్షన్ సిరీస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ కూడా చివరి దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఖుషి, సిటాడెల్ అనంతరం సమంత నుండి మరొ ప్రాజెక్ట్ వచ్చేందుకు చాలా గ్యాప్ పడనుంది. కొన్నాళ్లుగా సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. దానికి ఆమె చికిత్స తీసుకోవాలని అనుకుంటున్నారట. అలాగే సమంత ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
Look at this goddess❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Kushi pic.twitter.com/N4kbCl0n8D
— NARESH (@naresh__off_) July 4, 2023