Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. ఆమెకు ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. మొత్తానికి వ్యక్తిగత ఇబ్బందులకు ఫుల్ స్టాప్ చెప్పి కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్ లు అంగీకరిస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ప్రముఖ తమిళ కథానాయకుడు కార్తి సరసన నటించేందుకు ఆమెను సంప్రదించినట్లు కోలీవుడ్ సమాచారం.

కాగా తమిళ చిత్రం ‘బ్యాచిలర్’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సతీష్ సెల్వకుమార్ హీరో కార్తితో తన తర్వాత చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి కార్తీతో సినిమాకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన దగ్గర నుంచి సామ్ కు చాన్స్ లు పెరిగాయి. పైగా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు సామ్ బాగా ఉత్సాహంగా ఉంది.
Also Read: ఇది చాలా బాధాకరమైన సంఘటన – లావణ్య త్రిపాఠి
ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకి సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. అలాగే సమంత మరో వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుందట. సైలెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీకి ఇచ్చి అక్కడే కొన్నాళ్ళు ఉండిపోవాలని నిర్ణయించుకుంది సామ్.

నిజానికి గతంలో సమంతకు కొన్ని బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పుడు సమంత హిందీ చిత్రాల పై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ విడాకుల అనంతరం హిందీ సినిమాలే నా ప్రధాన టార్గెట్ అంటుంది. ఏది ఏమైనా ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వల్ల సమంతకి బాలీవుడ్ లో కొంత క్రేజ్ వచ్చింది. మొత్తానికి సైడ్ పాత్రలు వచ్చినా సమంత హిందీ సినిమాలను వదులుకునేలా లేదు.
Also Read: షాకింగ్ నిజాల మధ్యన ‘రామ సేతు’ సాగుతుంది – అక్షయ్ కుమార్