Actress Samantha: “ఏం మాయ చేశావే” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి… అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఈ క్రమంలోనే నాగ చైతన్యను వివాహం చేసుకుని… టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రతించిన విషయం తెలిసిందే. వీరి విడాకుల ప్రకటన తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది సామ్. సామ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ… అసత్య ప్రచారాలు చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి వాళ్ల నోరు మూయించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ కెరీర్‌పై దృష్టి సారిస్తోంది సమంత. అయితే తాజాగా సామ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ఇచ్చింది.

ప్రస్తుతం సమంతకు సంబంధించి ఓ కొత్త పోస్టర్ విడుదల అయింది. అయితే ఇది తెలుగు సినిమా కాదు, విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన తమిళ మల్టీస్టారర్ మూవీ “కాతువాకుల రెండు కాదల్”. ఈ సినిమా నుంచి తాజాగా సమంత ఫస్ట్ లుక్ విడుదల అయింది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ లో సమంత చాలా అందంగా కనిపించింది. ఈ సినిమాలో ఖతిజగా సమంత అందరినీ అలరించనుంది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్ తో కలిసి 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.
https://twitter.com/Samanthaprabhu2/status/1460156096706859013?s=20