
Samantha: మొన్ననే కదా యశోద సినిమా ప్రమోషన్ లో తనకు మయోసైటిస్ అని చెప్పింది.. ఆ వ్యాధితో పోరాడుతున్నా అని బాధపడింది.. ఆ సినిమా విడుదలైన తర్వాత సమంత కనిపించలేదు. మళ్లీ శాకుంతలం అనే సినిమా ప్రమోషన్లో అదే ధోరణి ప్రదర్శించింది. ఈసారి కళ్ళకు పెద్ద అద్దాలు, టిష్యూ పేపర్ తో ముక్కు చీదుకుంటూ రోగగ్రస్త సమంత లాగా కనిపించింది. ” బ్బాబ్బాబూ నా సినిమాను థియేటర్లలోనే చూడండి అంటూ” ప్రేక్షకులను బతిలాడుకుంది. కానీ ఆ సినిమాలో విషయం లేకపోవడంతో జనం పో పో సమంత అని పక్కన పెట్టారు.. దీంతో ఆ సినిమా తీసిన గుణశేఖర్ కు వాచిపోయింది. సినిమా రిలీజ్ చేసిన దిల్ రాజుకు తడిగుడ్డ మిగిలింది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటే సినిమా రిలీజ్ కి ముందు శోకాలు పెడుతున్న సమంత తర్వాత ఎందుకు కనిపించడం లేదు.. శాకుంతలం ప్రమోషన్ తర్వాత కూడా సమంత ఏకంగా హాలీవుడ్లో తేలింది. ఇక్కడ శోకాలు పెట్టిన సమంత.. అక్కడికి వెళ్ళిన తర్వాత కురచ దుస్తులతో జాలీగా గడుపుతోంది.
నాగచైతన్యతో వివాహ బంధం పెడాకులైన తర్వాత సమంత ఏం చేస్తుందో అర్థం కాకుండా ఉంది. అప్పట్లో నాగచైతన్యతో ఉన్నప్పుడే ఓ దిక్కుమాలిన వెబ్ సిరీస్ లో బరిబాతల నటించింది. ఆ సీన్స్ కట్ చేసేందుకు నాగార్జున కింద మీద పడాల్సి వచ్చింది. అయినప్పటికీ సమంత తన ధోరణి మానుకోలేదు. ఈలోపు విడాకులయ్యాయి.. దీంతో సమంత మరింత డిఫరెంట్ గా మారిపోయింది.. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. అదికూడా నాగచైతన్య మీద కోపంతోనే అని ఇండస్ట్రీవర్గాలు అంటూ ఉంటాయి.

ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటున్నది. గట్టిగా మేకప్ వేసుకొని కురచ దుస్తులతో అక్కడ సందడి చేస్తోంది.. ఇక్కడ ముక్కు చీదుకుంటూ కనిపించిన సమంత.. అక్కడికి వెళ్ళగానే అలా ఎలా మారిపోయింది అనేది ఆశ్చర్యకరమే. తనకు మయాసైటీస్ వస్తే బాధపడేంత తెలుగు ప్రేక్షకులు ఎవరూ కన్నీరు కార్చ లేదు.. పైగా నాకు రోగం వచ్చింది కాబట్టి సినిమా చూడండి అని చెబితే చూసే రోజులా ఇవి. నచ్చితే చూస్తారు, లేకుంటే లేదు. ఇదే దిల్ రాజు “బలగం” తీశాడు. సినిమా తీసిన వేణు ముక్కు చీదుకుంటూ నా సినిమా చూడండి అని ఎడ్వ లేదు..జస్ట్ తన కథ ద్వారా జనాన్ని ఏడిపించాడు..జనాల్ని థియేటర్ వైపు కదిలించాడు. అమెజాన్ లో స్ట్రీమ్ అవుతున్నా ఈ సినిమా ఇంకా థియేటర్ లలో ఆడుతోంది. అదీ సినిమా కథ లో దమ్ము అంటే.
ఇప్పుడు సమంత రెచ్చిపోయి ప్రచారం చేస్తున్న సిటాడెల్ ఒరిజినల్ వెర్షన్ లో బాలీవుడ్ ప్రియాంక నగ్నంగా నటించిందని ప్రచారం జరుగుతోంది. మరి ఇండియన్ వెర్షన్లో సమంత ఏం చేసిందో చూస్తే కానీ తెలియదు. అన్నట్టు ఆ మధ్య సిరీస్లో సమంత న్యూడ్ గా నటించింది. ఆ తర్వాతే ఆమె సంసారంలో చీలికలు పీలికలు మొదలయ్యాయి. ఇప్పుడు ఎలాగూ ఒంటరే కాబట్టి ఎలాగైనా నటించవచ్చు. తెలుగులో ముక్కు చీదింది కాబట్టి నడచిపోయింది. అదే హాలీవుడ్లో ఇవేవీ ఉండదు.. సమంత భాషలోనే చెప్పాలంటే “కర్మణ్యే వాధి కారస్తే.”