https://oktelugu.com/

Samantha: అభిమానిని పెళ్లాడబోతున్న సమంత..నాగ చైతన్య మీద కోపంతో ఎంత దూరమైనా వెళ్లేలా ఉందిగా!

ఒక అభిమాని సమంత ని ట్యాగ్ చేస్తూ 'సమంత గారు.మీకు తోడుగా ఎవరూ లేరని బాధపడొద్దు. మీ కోసం నేను ఉన్నాను. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. రెండేళ్ల సమయం ఇస్తే ఆర్థికంగా నేను నిలదొక్కుకొని మీ ముందుకు వస్తాను' అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 11, 2024 / 04:17 PM IST

    Samantha

    Follow us on

    Samantha: సోషల్ మీడియా లో ప్రముఖ హీరోయిన్ సమంత ఎంత యాక్టీవ్ గా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ప్రతీ రోజు ఆమె తనకి సంబంధించిన ఎదో ఫోటో ని, లేదా ఆ సమయం లో ఆమె మదిలో మెలిగే ఆలోచనలను స్టోరిల రూపం లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె పోస్టులకు లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్, వ్యూస్ వస్తుంటాయి. అలాగే అప్పుడప్పుడు ఆమె మనసుకి హత్తుకునే విధంగా ఎవరైనా అభిమాని పోస్ట్ పెడితే, దానికి ఆమె కచ్చితంగా సమాధానం ఇస్తుంది. రీసెంట్ గా ఆమె ఒక అభిమానికి అలాంటి రిప్లై ఇచ్చింది.

    ఒక అభిమాని సమంత ని ట్యాగ్ చేస్తూ ‘సమంత గారు.మీకు తోడుగా ఎవరూ లేరని బాధపడొద్దు. మీ కోసం నేను ఉన్నాను. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. రెండేళ్ల సమయం ఇస్తే ఆర్థికంగా నేను నిలదొక్కుకొని మీ ముందుకు వస్తాను’ అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యి సమంత దృష్టికి చేరింది. ఆ వీడియో లో అతని వెనుక జిమ్ వర్కౌట్స్ కి సంబంధించినవి ఉండడాన్ని చూసి, సమంత సమాధానం చెప్తూ ‘నీ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో జిమ్ ఉంది. అది చాలు నాకు, నేను దాదాపుగా ఒప్పుకున్నాను’ అని అంటుంది. దానికి ఆ అభిమాని ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇది నిజంగా జరుగుతుందో లేదో పక్కన పెడితే, సమంత లాంటి సూపర్ స్టార్ ఒక సాధారణమైన అభిమాని కి ఇంత మంచి సమాధానం ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

    ఇకపోతే నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మానసికంగా ఎంత కృంగిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒత్తిడికి గురై ఆమెకి మయోసిటిస్ వంటి ప్రాణాంతక వ్యాధికి కూడా బాధితురాలైంది. ఇప్పుడిప్పుడే చిన్నగా కోలుకుంటూ సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. మరోపక్క నాగ చైతన్య మాత్రం ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకొని పెళ్ళికి సిద్ధం అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అదే సమయం లో ఇన్ని రోజులు సమంతదే తప్పు అని అనుకున్న నెటిజెన్స్ మొత్తం ఇప్పుడు ఆమెపై సానుభూతి చూపిస్తూ, ఆమెకి సపోర్టుగా పోస్టులు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సమంత చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘ఖుషి’. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా యావరేజిగా నిల్చింది. ఈ చిత్రం తర్వాత ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. అతి త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. వీటితో ఒక తమిళ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్ధమైంది, అలాగే ఆమె నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటుంది.