Samantha: టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత, ఆ తర్వాత బాలీవుడ్ లోను తన సత్తా చూపిస్తున్న సామ్ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ మీడియా లోనూ ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటంటే సమంత తన జీవితంలోకి కొత్త మెంబర్ ని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది.
సమంత గురించి చిన్న న్యూస్ వచ్చిన కానీ, అది క్షణాల్లోనే వైరల్ అవుతుంది. సమంతకు మొదటి నుంచి పెట్స్ అంటే ఎంత ఇష్టమో..అందరికీ తెలుసు. సమంత దగ్గర ప్రస్తుతం రెండు పెట్స్ ఉన్నాయి. చాలా కాలంగా ఆమె దగ్గర హష్ అనే డాగ్ తోడుగా నాషా అనే పెట్ డాగ్ ను తీసుకు వచ్చారు. ఇక ఈ రెండిటి పెట్స్ తో తాను ఎంతో సరదాగా గడుపుతానంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఇదే ఫ్యామిలీలోకి మరొక పెట్ గలాటో వచ్చి చేరింది.
గలాటో అంటే మరేదో కాదు పిల్లి పిల్ల. దాని ముద్దు పేరు గలాటో . దానినే సమంత ఇంట్లోకి కొత్త మెంబర్ వచ్చారు అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గలాటో తో ఉన్న ఫోటోలు సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్టేటస్ గా పెట్టింది. అలా గుడ్ మార్నింగ్ చెప్తూ గలాటో తో ఉన్న ఫోటో షేర్ చేయగా నెట్టింట ఒక్కసారి వైరల్ గా మారిపోయింది ఆ చిత్రం..
ఇక సమంత సినిమాల విషయానికి ఖుషి మరియు సియాటెల్ చిత్రాలతో బిజీగా ఉన్న సమంత, త్వరలో సినిమాలకు గ్యాప్ ఇచ్చే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తుంది. దానికి కారణం మరొక సారి మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఆమె వ్యాధికి సంబంధించిన చాలా వరకు ఆమెకు ప్రశాంతత అవసరం అందుకే ఆమె నిత్యం మెడిటేషన్ చేస్తూ ఉంది. ఎక్కువగా దైవ సంబంధిత ప్రదేశాలలో సమంత ధ్యానం చేయడానికి ఇష్ట పడుతుంది. త్వరలోనే ఈ వ్యాధి నుంచి సమంత కోలుకోవాలని కోరుకుందాం.
View this post on Instagram